Page Loader
2024 బి ఎం డబ్ల్యూ X5 v/s 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE ఏది కొనడం మంచిది
రెండు SUVలలో ADAS ఫంక్షన్‌లు ఉన్నాయి

2024 బి ఎం డబ్ల్యూ X5 v/s 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE ఏది కొనడం మంచిది

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 24, 2023
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

వివిధ ప్రపంచ మార్కెట్ల కోసం ఈ నెలలో X5 SUV 2024 వెర్షన్ ను బి ఎం డబ్ల్యూ ప్రకటించింది. ఇది ఆగస్టు నాటికి భారతదేశంలోకి వస్తుందని తెలిపింది. అయితే మార్కెట్లో ఇది 2024 మెర్సిడెజ్-బెంజ్ GLEకి పోటీగా ఉంటుంది. బి ఎం డబ్ల్యూ "X" సిరీస్ నుండి అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో X5 ఒకటి. సెగ్మెంట్ లీడర్ GLEతో పోటీపడాలని 2024 వెర్షన్ ను విడుదల చేసింది. బి ఎం డబ్ల్యూ X5 3.0-లీటర్, టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-సిక్స్ ఇంజన్ , 3.0-లీటర్, నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ లేదా 4.4-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, V8తో నడుస్తుంది. మెర్సిడెజ్-బెంజ్ GLE 3.0-లీటర్, ఇన్‌లైన్-సిక్స్, డీజిల్ ఇంజిన్, 3.0-లీటర్, ఆరు-సిలిండర్, మైల్డ్-హైబ్రిడ్ టర్బో-పెట్రోల్ మోటార్ తో నడుస్తుంది.

కార్

అనుకూలమైన ఇంజన్ ఆప్షన్స్ తో బి ఎం డబ్ల్యూ కొనడం మంచిది

2024 బి ఎం డబ్ల్యూ X5 ప్రీమియంలో 15-రంగు పరిసర లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE డాష్‌బోర్డ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, టాబ్లెట్ లాంటి MBUX ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ తో , ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. USలో, 2024 బి ఎం డబ్ల్యూ X5 ధర $66,195 (సుమారు రూ. 54.77 లక్షలు) అయితే 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE ధర $61,000 (సుమారు రూ. 50.47 లక్షలు). అనుకూలమైన ఇంజన్ ఆప్షన్స్ తో పాటు విలాసవంతమైన, టెక్-ఫార్వర్డ్ క్యాబిన్‌ ఉన్న బి ఎం డబ్ల్యూ కొనడం మంచిది.