Page Loader
భారతదేశం మార్కెట్లో డిసెంబర్ విడుదల కాబోతున్న 2023మెర్సిడెస్-బెంజ్ GLC
20-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది

భారతదేశం మార్కెట్లో డిసెంబర్ విడుదల కాబోతున్న 2023మెర్సిడెస్-బెంజ్ GLC

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 09, 2023
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారతీయ మార్కెట్ కోసం మిడ్-సైజ్ ప్రీమియం SUV, 2023 GLCను డిసెంబర్ లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ వెర్షన్ లో SUVలో ఫ్రంట్ ఫాసియా ఉంది. వీల్‌బేస్‌ప్రస్తుత మోడల్ కంటే పొడవుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా, ఫోర్-వీలర్ మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. మెర్సిడెస్-బెంజ్ 2015లో GLC మోడల్‌ను పరిచయం చేసింది. ఈ 2023 వెర్షన్ సరికొత్త MRA ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. ఇది మొదట S-క్లాస్ మోడల్‌లో కనిపించింది. ఇందులో భద్రత విషయంలో రాజీ పడకుండా క్యాబిన్ స్థలాన్ని పెంచారు. SUVలో మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్లు, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు ఇరువైపులా ORVMలు, విశాలమైన ఎయిర్ డ్యామ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయి.

బెంజ్

2023మెర్సిడెస్-బెంజ్ GLC ధర లాంచ్ చేసేటప్పుడు ప్రకటించే అవకాశం

ఇది మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌ సపోర్ట్ తో, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో వస్తుంది. ఇందులో విలాసవంతమైన ఐదు-సీట్ల క్యాబిన్‌తో పాటు, మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌ల ద్వారా ప్రయాణికులకు భద్రతను ఇస్తుంది. 2023మెర్సిడెస్-బెంజ్ GLC ధర, ఇతర వివరాలను తయారీసంస్థ డిసెంబర్ 2023లో లాంచ్ ఈవెంట్‌లో ప్రకటిస్తారు. SUV ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువ ధర ఉండచ్చు, ప్రస్తుత మోడల్ ధర రూ. భారతదేశంలో 62 లక్షలు (ఎక్స్-షోరూమ్).