Page Loader
హైబ్రిడ్ ఇంజిన్‌ అప్డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో వచ్చిన 2024 బి ఎం డబ్ల్యూ X5, X6
2024 బి ఎం డబ్ల్యూ X5, X6 ఏప్రిల్‌లో ఉత్పత్తికి వెళ్లనున్నాయి

హైబ్రిడ్ ఇంజిన్‌ అప్డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో వచ్చిన 2024 బి ఎం డబ్ల్యూ X5, X6

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 08, 2023
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ తన X5, X6 SUVల 2024 వెర్షన్‌లను వెల్లడించింది. ఈ ఏప్రిల్‌లో ఉత్పత్తికి వెళ్లనున్నాయి. కార్లు డ్రైవర్ కు సహాయపడే అనేక ఫీచర్లతో , విశాలమైన క్యాబిన్‌లతో వస్తుంది. వివిధ హైబ్రిడ్ ఇంజిన్‌ల ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది. కేవలం 4.2 సెకన్లలో 0-96కిమీ/గం వేగంతో వెళ్లగలదు. బి ఎం డబ్ల్యూ X5, X6 2024 అప్డేట్ ఎడిషన్ ముందు మోడల్స్ తో పోల్చితే టెక్-ఆధారిత ఫీచర్‌లతో పాటు మెరుగైన పవర్‌ట్రెయిన్‌లతో వస్తాయి. Audi, మెర్సిడెస్ బెంజ్ తో ఈ సెగ్మెంట్ లో పోటీ పడుతుంది. బ్రూక్లిన్ గ్రే, ఐల్ ఆఫ్ మ్యాన్ గ్రీన్, మెరీనా బే బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.

కార్

ఈ రెండు వాహనాలు ఈ మార్చిలో ప్రారంభమవుతాయి

BMW X5, X6 లు 4.4-లీటర్, ట్విన్-టర్బో, V8 ఇంజిన్‌తో 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ తో కనెక్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ తో ఉన్న 3.0-లీటర్, టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-సిక్స్ మిల్, మైల్డ్-హైబ్రిడ్ సహాయంతో మరొక 3.0-లీటర్ మోటారు కూడా అందుబాటులో ఉంది. మూడు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం, పార్కింగ్ అసిస్టెంట్ ప్రొఫెషనల్, హైవే అసిస్టెంట్, వెనుక కెమెరాతో పాటు ఒకటి కంటే ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. USలో 2024 BMW X5 ధర $66,195 (సుమారు రూ. 54.7 లక్షలు) అయితే X6 ప్రారంభ ధర $74,895 (దాదాపు రూ. 62 లక్షలు)ఉంటుంది. ఈ రెండు వాహనాలు ఈ మార్చిలో ప్రారంభమవుతాయి.