భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది
జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ ఎట్టకేలకు భారతదేశంలో తన X1 SUV యొక్క 2023 వెర్షన్‌ను విడుదల చేసింది. కారు సరికొత్త డిజైన్ తో పాటు విలాసవంతమైన టెక్-లోడెడ్ క్యాబిన్ తో వస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఇది మార్కెట్ లో లగ్జరీ SUV విభాగంలో వోల్వో XC40కి పోటీగా ఉంటుంది. బి ఎం డబ్ల్యూ X1 భారతదేశంలో చాలా కాలంగా అందుబాటులో ఉంది. ఈ వెర్షన్ లో దాని ముందు మోడల్ తో పోల్చితే సరికొత్త డిజైన్ తో పాటు మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.
BMW X1 ప్రయాణికులకు మెరుగైన భద్రతను అందిస్తుంది
అప్డేట్ చేసిన వోల్వో XC40 గత సంవత్సరం భారతదేశంలో విడుదల చేసారు. ఇది టెక్-ఫార్వర్డ్ క్యాబిన్, సామర్థ్యం గల మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో వస్తుంది. బి ఎం డబ్ల్యూ X1 ప్రయాణీకుల భద్రత కోసం 10 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తే, XC40 ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. భారతదేశంలో, 2023 బి ఎం డబ్ల్యూ X1 ప్రారంభ ధర రూ. 45.9 లక్షలు నుండి రూ. 47.9 లక్షలు ఉంటే, వోల్వో XC40 ధర రూ. 45.9 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ఉంటుంది. బి ఎం డబ్ల్యూ X1 వోల్వో XC40తో పోల్చితే సరికొత్త డిజైన్ తో పాటు, మరిన్ని ఇంజన్ ఆప్షన్స్ ను అందించడమే కాదు, ప్రయాణీకులకు మెరుగైన భద్రతను అందిస్తుంది.