X7 SUV 2023వెర్షన్ ను 1.2కోట్లకు లాంచ్ చేసిన BMW సంస్థ
జర్మన్ వాహన తయారీ సంస్థ BMW X7 SUVని భారతదేశంలో విడుదల చేసింది. ఇది xDrive40i M Sport, xDrive40d M Sport వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు కంపెనీ యొక్క కొత్త డిజైన్ తో పాటు సరికొత్త టెక్నాలజీతో ఉన్న ట్వీక్డ్ క్యాబిన్ తో వస్తుంది. రెండూ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో 3.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ల ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. 2023 BMW X7 ముందున్న మాడెల్ తో పోల్చితే మెరుగైన ఫీచర్లను అందిస్తుంది. ఈ కారు చెన్నైలోని బ్రాండ్ ఫ్యాక్టరీలో స్థానికంగా రూపొందుతుంది. భారతీయ మార్కెట్లో, ప్రీమియం ఫోర్-వీలర్ వోల్వో XC90,మెర్సిడెజ్-బెంజ్ GLS, Audi Q7 వంటి ప్రత్యర్థులతో పోటీలో ఉంటుంది.
ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది
2023 BMW X7లో మస్కులర్ బానెట్, స్ప్లిట్ LED హెడ్‌లైట్‌లు, ఇంటిగ్రేటెడ్ లైటింగ్ ఎలిమెంట్‌తో ఉన్న పెద్ద కిడ్నీ గ్రిల్, విశాలమైన ఎయిర్ వెంట్ ఉంది. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ADAS ఫంక్షన్ తో వస్తుంది. మోటార్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో ఉంటాయి. ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ డంపర్లు, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో, 2023 BMW X7 xDrive40i M స్పోర్ట్ వెర్షన్ ధర రూ. 1.22 కోట్లు, xDrive40d M స్పోర్ట్ వెర్షన్ ధర రూ. 1.25 కోట్లు ( ఎక్స్-షోరూమ్). ప్రస్తుతానికి బుకింగ్‌లు తెరుచుకున్నాయి, వీటి డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి.