Page Loader
7 సిరీస్‌లతో పాటు BMW i7 జనవరి 7న లాంచ్
BMW 7 సిరీస్ లో ప్రయాణికుల వినోదం కోసం 8k స్క్రీన్ ఉంది

7 సిరీస్‌లతో పాటు BMW i7 జనవరి 7న లాంచ్

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 22, 2022
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

BMW జనవరి 7న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జరిగే "జాయ్‌టౌన్" ఈవెంట్‌లో 7 సిరీస్, సరికొత్త i7ను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2022 ఏప్రిల్‌లో వివిధ గ్లోబల్ మార్కెట్లలో ఈ సంస్థ ప్రీమియం కార్లను విడుదల చేసింది. ధర, ఇతర వివరాలను జనవరి 7న ముంబైలో జరిగే వేడుకలో ప్రకటిస్తారు. US మార్కెట్‌లో మొదటిది సుమారు రూ. 78 లక్షలు అయితే, అయితే రెండోది రూ. 99 లక్షలు ఉంది. 2023 BMW 7 సిరీస్ లో పొడవాటి హుడ్, ఒక పెద్ద కిడ్నీ గ్రిల్, స్ప్లిట్-టైప్ LED హెడ్‌లైట్‌లు, ఇంటర్నల్ కెపాసిటివ్ బటన్‌ ఉన్న డోర్ హ్యాండిల్స్, చుట్టూ ఉండే LED టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

BMW

BMW i7 లో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నాయి

సరికొత్త BMW i7లో దాదాపు అన్ని ఫీచర్లు ఒకటే కాకపోతే క్రోమ్-లైన్డ్ విండోస్, షార్క్-ఫిన్ యాంటెన్నా అదనంగా ఉన్నాయి. 2023 BMW 7 సిరీస్ లోపల, సెడాన్ డ్యాష్‌బోర్డ్‌పై పూర్తి-వెడల్పు లైట్ బ్యాండ్‌తో విలాసవంతమైన క్యాబిన్, 12.3-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం వంపు తిరిగిన ప్యానెల్, 31.3-అంగుళాల రూఫ్-మౌంట్, 8K స్క్రీన్ ఉన్నాయి. BMW i7 లోపల, విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్, హీటింగ్, మసాజ్ ఫంక్షన్ వంటి సౌకర్యాలతో ఉన్న సీట్లు, వెనుక ప్రయాణీకుల కోసం రూఫ్-మౌంటెడ్ 8K స్క్రీన్, iDrive 8తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్, పనోరమిక్ స్కై లాంజ్ LED రూఫ్ ఉన్నాయి. 101.7kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 483కిమీల వరకు నడుస్తుంది.