Page Loader
ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X
ఈ నెలలో రెండు కార్ల ధరలు వరుసగా 5.3%, 9.1% తగ్గాయి

ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 07, 2023
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలోన్ మస్క్ సంస్థ ఎలక్ట్రిక్ వాహన తయారీసంస్థ టెస్లా USలో మోడల్ S, X కార్ల ధరలను తగ్గించింది. ఈ ఏడాది జనవరి తర్వాత దేశంలో వాహనాల ధరలు తగ్గించడం ఇది రెండోసారి. ఇప్పుడు, మోడల్ S $89,990 (సుమారు రూ. 73.6 లక్షలు) నుండి ప్రారంభమవుతుంది, అయితే మోడల్ X ప్రారంభ ధర $99,990 (దాదాపు రూ. 81.8 లక్షలు). మోడల్ S, మోడల్ X కార్ల ధరలను ఏడు వారాల క్రితమే తగ్గించింది టెస్లా. అయితే, డిమాండ్ పెంచడానికి ఈ తగ్గింపు సరిపోలేదు. జనవరిలో మోడల్ S ధర $94,990 (సుమారు రూ. 77.8 లక్షలు), మోడల్ X ధర $109,990 (దాదాపు రూ. 90 లక్షలు) ఉన్నాయి.

కార్

ఈ నెలలో రెండు కార్ల ధరలు వరుసగా 5.3%, 9.1% తగ్గాయి

జనవరితో పోలిస్తే, ఈ నెలలో రెండు కార్ల ప్రారంభ ధరలు వరుసగా 5.3%, 9.1% తగ్గాయి. మోడల్ S, X టెస్లా అత్యంత ఖరీదైన వాహనాలు. 2022లో, రెండు కార్ల డెలివరీలలు కేవలం 5% మాత్రమే జరిగాయి. కంపెనీ గతేడాది ఈ మోడల్స్ 66,705 కార్లను కొనుగోలుదారులకు అందజేసింది. టెస్లా మోడల్ సెడాన్‌లో ఐదు సీట్లు, 22-స్పీకర్ సౌండ్ సిస్టమ్, యోక్-స్టైల్ స్టీరింగ్ వీల్, ఆటోపైలట్ సౌకర్యం ఉన్నాయి. డ్యూయల్/ట్రై-మోటార్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో ఒక్కో ఛార్జ్‌కి 652కిమీల వరకు నడుస్తుంది. టెస్లా మోడల్ X లోపల వైర్‌లెస్ ఫాస్ట్-ఛార్జర్, ఆటోపైలట్ సౌకర్యం, ఎయిర్ ఫిల్టర్‌లు ఉన్నాయి. ఇది డ్యూయల్/ట్రై-మోటార్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ తో ఒక్కసారి చార్జ్ తో 560కిమీల వరకు నడుస్తుంది.