Page Loader
రెగ్యులర్ కవర్లను మరచిపోండి, భవిష్యత్తులో మీ కారుకు ఇటువంటి రక్షణ  అవసరం
భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన కార్ కవర్

రెగ్యులర్ కవర్లను మరచిపోండి, భవిష్యత్తులో మీ కారుకు ఇటువంటి రక్షణ అవసరం

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 22, 2023
07:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

యుఎస్ఎకు చెందిన ఆటోమోటివ్ యాక్సెసరీ తయారీదారు కార్క్యాప్సూల్ గాలితో ఉన్న కార్ బబుల్ స్టోరేజ్ సిస్టమ్‌తో కారు కవర్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చింది. కవర్ వేర్వేరు ఆకారాలు, సైజులలో లభిస్తుంది. అన్ని రకాల కార్లు, బైక్‌లు,వ్యాన్లను స్టోర్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది హెవీ-డ్యూటీ 10 మిమీ పివిసి పదార్థాన్ని ఉపయోగించి తయారు చేయబడింది. పిడికె ఆటోమోటివ్ పేటెంట్ 1991 లో, కార్కాప్సూల్‌ కు మోటర్‌ట్రెండ్ నుండి "టాప్ 10 మోస్ట్ ఇన్నోవేటివ్ కార్ కేర్ ప్రొడక్ట్" బిరుదు లభించింది. ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థ ఎలక్ట్రిక్ ఫ్యాన్ ను ఉపయోగించడం ద్వారా వాహనం, కవర్ మధ్య గాలిని సృష్టిస్తుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బబుల్ కవర్ ను టెస్ట్ చేస్తున్న వీడియో

కార్

పివిసి మెటీరియల్‌ను ఉపయోగించి తయారు చేసిన నిల్వ వ్యవస్థ అన్నిటి నుండి పూర్తి రక్షణను అందిస్తుంది

అంతర్గత ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి, అధిక తేమను తొలగించడానికి గంటకు మూడు లేదా నాలుగు సార్లు గాలిని పునర్వినియోగం చేయడానికి కూడా ఇది ఉపయోగించచ్చు. ఎలక్ట్రిసిటీ లేనప్పుడు, సిస్టమ్ సీలు చేసిన-రకం రెగ్యులర్ కార్ కవర్‌గా మారుతుంది. గాలితో ఉన్న కార్ల నిల్వ వ్యవస్థ తయారీ, రిటైలింగ్ 2012 లో కార్కాప్సుల్ యుఎస్ఎ చేజిక్కించుకుంది. హెవీ-డ్యూటీ 10 మిమీ క్లియర్ పివిసి మెటీరియల్‌ను ఉపయోగించి తయారు చేసిన నిల్వ వ్యవస్థ డెంట్స్, డస్ట్, డర్ట్, తుప్పు, వాసనలు, తెగుళ్ళకు వ్యతిరేకంగా పూర్తి రక్షణను అందిస్తుంది.