ఆటోమొబైల్ రంగం భవిష్యత్తును నిర్దేశించనున్న Qualcomm Snapdragon Digital Chassis
టెక్నాలజీ దిగ్గజం Qualcomm USలోని లాస్ వెగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో Snapdragon Digital Chassis కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ కారుతో ఆటోమేకర్లు దాని టెక్నాలజీ, సర్వీస్ ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రదర్శించింది. ఇది మొదటి ఆటోమోటివ్ సూపర్-కంప్యూట్ క్లాస్ సొల్యూషన్ గా ప్రచారం అవుతుంది. మొబైల్, వైర్‌లెస్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న US-ఆధారిత Qualcomm, దాని ప్రసిద్ధ స్నాప్‌డ్రాగన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఆటో మొబైల్ రంగంలో మొట్ట మొదటి ఉత్పత్తి ఇది. ఇందులో స్నాప్‌డ్రాగన్ రైడ్ ఫ్లెక్స్ SoC ఆటోమేటెడ్ డ్రైవింగ్ (AD), అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) అన్నీ ఒకదానికొకటి కొనెక్ట్ అయ్యి ఉంటాయి.
ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం లెవెల్-3 అటానమస్ డ్రైవింగ్
ఇందులో పొడవైన బానెట్, ఇరు వైపులా, ORVMల స్థానంలో కెమెరాలతో పాటు రంగును మార్చే లైట్ బార్ వెనుక భాగంలో ఉంటాయి. సాంకేతిక వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ, ఈ ప్లాట్‌ఫారమ్ ప్రస్తుత, భవిష్యత్తు ICE-ఆధారిత కార్లు అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలంగా ఉంటుందని సంస్థ పేర్కొంది. ఇందులో డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం 55-అంగుళాల పిల్లర్-టు-పిల్లర్ డిస్‌ప్లే, బయట కెమెరాల డిస్‌ప్లేలుగా పనిచేసే గుండ్రని స్క్రీన్‌లు, యోక్-స్టైల్ స్టీరింగ్ వీల్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, బయోమెట్రిక్ కోసం కెమెరాలతో పాటు వాయిస్ కూడా ఉంటుంది. ప్రయాణీకుల భద్రత కోసం లెవెల్-3 అటానమస్ డ్రైవింగ్ తో పాటు ADAS ఫంక్షన్ కూడా ఉంటుంది. ఇది ఇంకా ప్రారంభ కాన్సెప్ట్ దశలోనే ఉంది.