అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు
2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ నిలబడబోతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని కూడా ఇప్పటికే అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ క్రమంలో వైట్ హౌస్ కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ సాధారణ వైద్య పరీక్షలను చేయించుకోనున్నట్లు ప్రకటించింది. పరీక్షల అనంతరం బైడెన్ ఆరోగ్య నివేదికను విడుదల చేయనున్నట్లు చెప్పింది. ప్రస్తుతం బైడెన్ వయస్సు 80ఏళ్లు కాగా, ఆయన 2021లో కూడా తన వైద్య నివేదికను విడుదల చేశారు. తన వయసుపై ప్రతిపక్ష నేతలు తరుచూ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో తాను ఫిట్‌గా ఉన్నానన్న సంకేతాన్ని ఇవ్వడం కోసమే బైడెన్ మరోసారి వైద్య పరీక్షలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
బైడెన్‌కు ప్రత్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌పట్ల వ్యతిరేకత ఉందని పలు సర్వే సంస్థలు తమ నివేదకను వెల్లడించాయి. అయితే బైడెన్ ఈసారి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికల్లో బైడెన్‌కు ప్రత్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బరిలోకి నిలిచే అవకాశముంది. 2021లో బైడెన్ కొలొనోస్కోపీతో సహా అన్నిరకాల పరీక్షలు చేయించుకున్నారు. చెకప్ సమయంలో అతను వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు ఒక గంట 25నిమిషాల పాటు తన అధికారాలను బదిలీచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష అధికారాన్ని కలిగి ఉన్న మొదటి మహిళగా ఆమె నిలిచారు. బైడెన్ తన అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించడానికి సరిపోతారని అతని వైద్యుడు కెవిన్ ఓ కానర్ 2021లో నివేదక ఇచ్చారు.