Page Loader
ఎయిర్ ఇండియా చారిత్రక ఒప్పందం: 34బిలియన్ డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఆర్డర్
34బిలియన్ డాలర్ల విలువై 220 బోయింగ్ విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్

ఎయిర్ ఇండియా చారిత్రక ఒప్పందం: 34బిలియన్ డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఆర్డర్

వ్రాసిన వారు Stalin
Feb 15, 2023
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

'టాటా'లకు చెందిన ఎయిర్ ఇండియా - అమెరికాకు చెందిన బోయింగ్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. 34 బిలియన డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా 46బిలియన్ డాలర్ల విలువైన 250 ఎయిర్‌బస్ విమానాలను కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న మరుసటి రోజే.. బోయింగ్‌తో డీల్‌ను కుదుర్చుకోవడం గమనార్హం. భవిష్యత్తులో భారతదేశం మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరిస్తుందని, రాబోయే 15 ఏళ్లలో 2,000 కంటే ఎక్కువ విమానాలు అవసరమవుతాయని ప్రధాని మోదీ ఇటీవల అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆశయాలకు ఆనుగుణంగా ఎయిర్ ఇండియా కొత్త విమానాల కొనుగోలుపై దృష్టి సారించింది.

బైడెన్

ఈ ఒప్పందంతో 44రాష్ట్రాల్లో సుమారు మిలియన్ మంది ఉద్యోగాలు: బైడెన్

ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర సహకారంపై ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటన విడుదల చేసింది. భారతదేశం విస్తరిస్తున్న పౌర విమానయాన రంగం ద్వారా సృష్టించబడిన అవకాశాలను ఉపయోగించుకోవాలని మోదీ ఇతర అమెరికా కంపెనీలను కూడా ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని కూడా ప్రశంసించారు. ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని 44రాష్ట్రాల్లో సుమారు మిలియన్ ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడుతుందని చెప్పారు. ఎయిర్ ఇండియా - బోయింగ్ మధ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని వైట్ హౌస్ ప్రకటన పేర్కొంది.