Page Loader
కెనడా సరిహద్దులో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన అమెరికా
కెనడా సరిహద్దులో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన అమెరికా

కెనడా సరిహద్దులో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన అమెరికా

వ్రాసిన వారు Stalin
Feb 13, 2023
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్నిరోజులుగా అమెరికాలో గగనతల ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికా గగనతలంలో అనుమానాస్పదంగా కనిపించిన గుర్తు తెలియని వస్తువును అమెరికా దళాలు కూల్చివేశాయి. కెనడా సరిహద్దులో 20వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఆ వస్తువును హురాన్ సరస్సుపై ఎఫ్-16 ఫైటర్ జెట్ సాయంతో కూల్చి వేసినట్లు అధికారులు ప్రకటించారు. కూల్చివేసిన ఆ వస్తువు స్ట్రింగ్‌లతో కూడిన అష్టభుజి ఆకారంలో ఉన్నట్లు వెల్లడించారు. మిచిగాన్ మీదుగా వెళుతున్న ఇది, పౌర విమానయానానికి ప్రమాదంగా పరిణమించడంతో దీన్ని కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఒక చైనా నిఘా బెలూన్‌తో పాటు రెండు అనుమానాస్పద వస్తువును అమెరికా కూల్చివేసింది. తాజాగా 4వది పేల్చేసింది. వరుసగా మూడు రోజుల్లో ఇది నాలుగో ఘటన కావడం గమనార్హం.

అమెరికా

నిఘా సామర్థ్యం ఉందో? లేదో? తెలియదు: అధికారులు

20,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న వస్తువుకు నిఘా సామర్థ్యం ఉందా? లేదా? అనేది నిర్ధారించలేదని అధికారులు తెలిపారు. కెనడా సరిహద్దు వైపు వస్తువును కాల్చడానికి ముందు అధికారులు మిచిగాన్ సరస్సుపై ఉన్న గగనతలాన్ని కొద్దిసేపు మూసివేశారు. కెనడా సీపీ-140 పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ మద్దతుతో రికవరీ బృందాలు శిథిలాల కోసం అన్వేషణను కొనసాగిస్తున్నాయి. విషయం తెలిసిన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆదివారం సైట్‌ను సందర్శించారు.