Page Loader
'స్పై బెలూన్' ఎపిసోడ్: ఆరు చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన అమెరికా
ఆరు చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన చైనా

'స్పై బెలూన్' ఎపిసోడ్: ఆరు చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన అమెరికా

వ్రాసిన వారు Stalin
Feb 11, 2023
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా 'గూఢచారి' బెలూన్ వ్యవహారాన్ని అమెరికా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగనతలంలో ఎగురుతున్న చైనా 'స్పై బెలూన్‌'‌ను కూల్చేసిన అగ్రరాజ్యం, తాజాగా ఆ దేశ కంపెనీలకు షాకిచ్చింది. చైనాకు సంబంధించిన విమానయాన, సాంకేతిక సంస్థల నుంచి కొనుగోళ్లను తగ్గించాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. చైనాకు చెందిన ఐదు కంపెనీలతో పాటు ఒక పరిశోధనా సంస్థను అమెరికా వాణిజ్య విభాగం బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం వల్ల ఆ కంపెనీల నుంచి ఎలాంటి లావాదేవీలను నిర్వహించడానికి వీలుండదు.

అమెరికా

జాతీయ భద్రతకు ముప్పు: అమెరికా

నిఘా కోసం అధిక ఎత్తులో ఉండే బెలూన్లను చైనా ఉపయోగించడం వల్ల ఆ దేశ కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు అమెరికా వాణిజ్య శాఖ అండర్ సెక్రటరీ అలాన్ ఎస్టేవెజ్ చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. యూఎస్ జాతీయ భద్రతకు హాని కలిగించే సంస్థలు అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా నిలిపివేసేందుకే ఈ చర్యను తీసుకున్నట్లు అలాన్ ఎస్టేవెజ్ స్పష్టం చేశారు. అమెరికా గగన తలంలో ఎగిరిన బెలూన్‌ను అభివృద్ధి చేయడంలో లేదా ఆపరేట్ చేయడంలో స్థానిక చైనా కంపెనీలు ప్రత్యక్ష పాత్ర పోషించాయో లేదో వాణిజ్య శాఖ పేర్కొనలేదు.