NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / 'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా
    తదుపరి వార్తా కథనం
    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా
    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదని చెప్పిన అమెరికా

    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా

    వ్రాసిన వారు Stalin
    Feb 07, 2023
    11:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగనతలంలో ఎగురుతున్న చైనా 'గూఢచారి' బెలూన్‌‌ను శనివారం అగ్రరాజ్య బలగాలు కూల్చేశాయి. అయితే ఆ బెలూన్ శిథిలాలను తిరిగి చైనాకు అప్పగించేది లేదని తాజాగా అమెరికా ప్రకటించింది.

    అంతేకాదు ఈ ఘటన వల్ల అమెరికా-చైనా సంబంధాలు బలహీనపడలేదని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడం గమనార్హం.

    ఇప్పటికే సముద్ర ఉపరితలంలోని కొన్ని బెలూన్ అవశేషాలను సేకరించినట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల సముద్రం గర్భంలోని ఇతర శిథిలాలను సేకరించలేదని పేర్కొన్నారు.

    రెండు రోజుల క్రితం మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగనతలంలో ఎగురుతున్న చైనా బెలూన్‌ను ఫైటర్ జెట్ సాయంతో అమెరికా కూల్చివేసింది.

    చైనా

    బెలూన్ గురించి ముఖ్యమైన సమాచారాన్నిసేకరించాం: అమెరికా

    కొన్ని రోజుల్లోనే సముద్రంలోని ఉన్న మిగతా భాగాలను సేకరించి పరిశీలిస్తామని జాన్ కిర్బీ వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

    ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది నిఘా బెలూన్ అని వైట్ హౌస్ స్పష్టం చేసినట్లు కిర్బీ పేర్కొన్నారు. కూల్చివేయడానికి ముందే, బెలూన్ గురించి తగినంత ముఖ్యమైన సమాచారాన్ని సేకరించినట్లు కిర్బీ చెప్పారు.

    బెలూన్ దానంతట అది ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉందనేది నిజమేనని, అయితే దాని వేగాన్ని నియంత్రించడానికి అందులో ప్రొపెల్లర్లు ఉన్నట్లు కిర్బీ వివరించారు.

    ఆ బెలూన్ 200 అడుగుల ఎత్తు వరకు ఉంటుందని నార్తర్న్ కమాండ్ కమాండర్ జనరల్ గ్లెన్ వాన్‌హెర్క్ చెప్పారు. దీని బరువు చిన్నపాటి జెట్ విమానం అంత ఉంటుందని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    చైనా
    జో బైడెన్

    తాజా

    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య
    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం స్టాక్ మార్కెట్
    మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు గూగుల్
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా

    చైనా

    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్
    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు కోవిడ్
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్

    జో బైడెన్

    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025