Page Loader
చైనాలో మరో కరోనా వేవ్, కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తలు ఏం అన్నారంటే?
చైనాలో మరో కరోనా వేవ్, కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తల పరిశోధన

చైనాలో మరో కరోనా వేవ్, కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తలు ఏం అన్నారంటే?

వ్రాసిన వారు Stalin
Feb 09, 2023
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో ఇటీవల కొత్త వేరియంట్ల కారణంగా కరోనా కేసులు ఏ స్థాయిలో పెరిగాయో అందరకీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఏమైనా కొత్త వేరియంట్లు పుట్టకొచ్చాయా? అనే అంశంపై ఒక పరిశోధన జరిగింది. 'ది లాన్సెట్‌'లో ఆ పరిశోధన ప్రచురితమైంది. 'జీరో కోవిడ్' విధానాన్ని సడలించినప్పటి నుంచి చైనాలో కేసుల పెరుగుదల సమయంలో కొత్త వేరియంట్లను గుర్తించలేదని ఆ పరిశోధన పేర్కొంది. చైనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే భయం నుంచి ప్రపంచం పూర్తిగా బయటకు రావాలని పరిశోధనకు నాయకత్వం వహించిన చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాజీ హెడ్ జార్జ్ గావో అన్నారు. జార్జ్ గావో ప్రస్తుతం చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

చైనా

75శాతానికిపైగా BF.7 వేరియంట్ కేసులే: జార్జ్ గావో

గత ఏడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ 20 మధ్య బీజింగ్‌లో నమోదైన కరోనా కేసులను పరిశీలించగా, అందులో 90శాతం కంటే ఎక్కువ ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లైన BF.7 లేదా BA.5.2 బాధితులే ఉన్నట్లు పరిశోధన చెబుతోంది. ఆ సమయంలో విదేశాల నుంచి వచ్చిన కరోనా బాధితులను పరీక్షించగా, వారిలో అంతగా ప్రభావం చూపని కరోనా వేరియంట్లను గుర్తించినన్లు వెల్లడించింది. బీజింగ్‌లో 75శాతానికిపైగా BF.7 వేరియంట్ కేసులేనని జార్జ్ గావో బృందం చేసిన అధ్యయనం చెబుతోంది. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, జార్జ్ గావో స్పష్టం చేశారు. అయితే భవిష్యత్‌లో మరో వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.