'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా
ఇటీవల అమెరికా గుర్తించిన చైనా గూఢచారి బెలూన్లపై 'వాషింగ్టన్ పోస్ట్' సంచలన విషయాలను బయపెట్టటింది. భారత్, జపాన్‌తో సహా పలు దేశాలే లక్ష్యంగా గూఢచారి బెలూన్ల ద్వారా చైనా రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పేర్కొంది. చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్‌లో చాలా సంవత్సరాలుగా చైనా నిఘా బెలూల్ వ్యవస్థ పనిచేస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అది భారత్, జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్‌తో ఇతర దేశాల రక్షణ వ్వవస్థకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించినట్లు నివేదించింది. చైనా 'గూఢచారి' బెలూన్‌ను అమెరికా కూల్చేసిన కొన్ని రోజుల అనంతరం 'వాషింగ్టన్ పోస్ట్' ఈ కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు, ఆ బెలూన్ శిథిలాలను తిరిగి చైనాకు అప్పగించేది లేదని ప్రకటించింది.
ఐదు ఖండాల్లో చైనా నిఘా బెలూన్లు
రక్షణ, ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి చైనా నిఘా బెలూన్ వ్వవస్థకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వివరించింది. చైనా ఆర్మీ నింయత్రిస్తున్న ఈ నిఘా ఎయిర్‌షిప్‌లు ఐదు ఖండాల్లో కనిపించిటన్లు అధికారులు చెప్పినట్లు పేర్కొంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగమైన ఈ బెలూన్‌లు నిఘా కార్యకలాపాలను నిర్వహించడానికి అభివృద్ది చేసినట్లు వెల్లిడించింది. హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువామ్ గగన తలలాల్లో నాలుగు చైనా నిఘా బెలూన్లు కనిపించిటన్లు 'వాషింగ్టన్ పోస్ట్' చెప్పింది. గత వారం ఒక బెలూన్‌ను అమెరికా కూల్చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత్ సహా మిత్రదేశాలకు వివరించారు. 40 రాయబార కార్యాలయాల అధికారులకు దీని గురించి వివరించారు.