క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్
స్విట్జర్లాండ్ కు చెందిన అతిపెద్ద బ్యాంక్ UBS, ఆర్ధిక సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ని కొనుగోలు చేయడానికి అంగీకరించింది. 3 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లతో ఒప్పందాన్ని చేసుకున్నారు స్విస్ అధికారులు. క్రెడిట్ సూయిస్ కొంతకాలంగా తన వినియోగదారులు, పెట్టుబడిదారుల నమ్మకాన్ని కోల్పోతోంది. అమెరికన్ బ్యాంకుల పతనంతో క్రెడిట్ సూయిస్ తీవ్రంగా దెబ్బతింది. రెండు అమెరికన్ బ్యాంకులు (సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్) పతనం బ్యాంకింగ్ రంగాన్ని విపరీతమైన ఒత్తిడికి గురి చేశాయి. వారాంతంలో హడావుడిగా ఏర్పాటు చేసిన చర్చల్లో ఈ టేకోవర్ గురించి చర్చలు జరిగాయి. గ్లోబల్ ఫైనాన్స్‌కు బ్యాంక్ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, సంక్షోభం మరింత ముదిరిపోకుండా నివారించడానికి స్విస్ అధికారులు ముందుకు వచ్చారు.