అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV
దక్షిణ కొరియా తయారీసంస్థ హ్యుందాయ్ తన కోనా SUV 2024 వెర్షన్‌ను వెల్లడించింది. ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహన విభాగాల్లో అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. 2024 హ్యుందాయ్ కోనా దాని ముందు మోడల్ తో పోల్చితే మెరుగైన రూపాన్ని, మరింత లగ్జరీని అందిస్తుంది. కొత్త కారు కూడా భారతీయ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా సృష్టత లేదు. కొత్త హ్యుందాయ్ కోనాలో హీటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, 12.0-అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లే, బ్యాక్‌లిట్ ఫ్లోటింగ్-స్టైల్ డ్యాష్‌బోర్డ్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌తో ఉన్న 5-సీటర్ క్యాబిన్ ఉంది.
ప్రయాణీకుల భద్రత కోసం 360-డిగ్రీ-వ్యూ కెమెరా
ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ-వ్యూ కెమెరా, ADAS సూట్‌తో వస్తుంది. కోనా 2.0-లీటర్ పెట్రోల్, 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌లతో నడుస్తుంది. అవి ఫ్రంట్/ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌లకు లింక్ అవుతాయి. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో, ఒక ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు 48.4kWh లేదా 65.4kWh బ్యాటరీ ప్యాక్‌తో లింక్ అవుతుంది. చిన్న బ్యాటరీతో ఉన్న వేరియంట్ 342కిమీ వరకు నడిస్తే, పెద్ద యూనిట్‌తో 490కిమీ వరకు నడుస్తుంది. 2024 హ్యుందాయ్ కోనా ధర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, USలో, ఈ కారు ప్రారంభ ధర దాదాపు $24,000 (దాదాపు రూ. 19.6 లక్షలు) ఉంటుందని అంచనా.