Page Loader
2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం
గ్లోబల్ మార్కెట్లలో ELANTRA 2024ను లాంచ్ చేసిన హ్యుందాయ్

2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 03, 2023
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ప్రీమియమ్ మిడ్-సైజ్ సెడాన్ ELANTRA 2024 వెర్షన్‌ను ప్రపంచ మార్కెట్ల కోసం ఆవిష్కరించింది. స్వదేశీ మార్కెట్‌లో ఈ కారును 'అవాంటే' అని పిలుస్తారు. 1990లో వచ్చినప్పటి నుండి US, యూరోపియన్ మార్కెట్‌లలో హ్యుందాయ్‌కి అత్యధికంగా అమ్ముడైన మోడల్‌లలో ELANTRA ఒకటి. 2024 హ్యుందాయ్ ELANTRA దాదాపు ప్రస్తుత మోడల్‌లోని డిజైన్ తోనే వస్తుంది. సెడాన్‌లో ఫార్వర్డ్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ (FCA), బ్లైండ్-స్పాట్ కొలిజన్-ఎవాయిడెన్స్ అసిస్ట్ (BCA), రియర్ క్రాస్ ట్రాఫిక్ కొలిజన్-ఎవాయిడెన్స్ అసిస్ట్ (RCCA), లేన్ కీపింగ్ అసిస్ట్ (LKA), స్టాప్ & గో (LKA)తో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. సిస్టమ్ అల్ట్రాసోనిక్ సెన్సార్‌లతో ఫార్వర్డ్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.

హ్యుందాయ్

2024 హ్యుందాయ్ ELANTRA విశాలమైన, టెక్-ఫార్వర్డ్ ఐదు-సీట్ల క్యాబిన్‌ తో వస్తుంది

2024 హ్యుందాయ్ ELANTRA లోపలి భాగంలో విశాలమైన, టెక్-ఫార్వర్డ్ ఐదు-సీట్ల క్యాబిన్‌ తో వస్తుంది. సెడాన్‌లో మినిమలిస్ట్ డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌లతో ఉన్న డిజిటల్ కాక్‌పిట్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌లు ఉన్నాయి. ఇది సామర్థ్యం గల పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ ద్వారా సపోర్ట్ ఇస్తుంది. 2024 ELANTRA సాంకేతిక వివరాలను హ్యుందాయ్ ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ, ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్ 2.0-లీటర్, ఇన్‌లైన్-ఫోర్, పెట్రోల్-హైబ్రిడ్ సెటప్ తో, 1.6-లీటర్, టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్ తో నడుస్తుంది.