Page Loader
మారుతి సుజుకి Ignis vs హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఏది కొనడం మంచిది
ignis ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్టెన్స్ ఉంది

మారుతి సుజుకి Ignis vs హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఏది కొనడం మంచిది

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 01, 2023
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మారుతీ సుజుకిIgnis 2023 వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కారులో స్టైలిష్ డిజైన్, కొత్త భద్రతా ఫీచర్లతో ఉన్న విశాలమైన క్యాబిన్ అందించే BS6 ఫేజ్ 2-కంప్లైంట్ 1.2-లీటర్, నాలుగు-సిలిండర్, VVT పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఇది మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS మోడల్‌కు పోటీగా ఉంటుంది. Ignisను భవిష్యత్తు అవసరాలకు అనుకూలంగా మార్చడానికి, దాని అమ్మకాలను పెంచడానికి, మారుతి సుజుకి భారతదేశంలో అప్డేట్ చేసిన కారును విడుదల చేసింది. అయితే ధరను కూడా విపరీతంగా పెంచింది. అయితే హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS చాలాకాలం నుండి ఇక్కడ అందుబాటులో ఉంది, స్పోర్టీ లుక్స్ తో అందరిని ఆకర్షిస్తుంది.

కార్

అప్డేట్ అయిన Ignis కన్నా i10 NIOSలో స్టైలిష్ డిజైన్ తో పాటు ఎక్కువ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి

Ignis ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్టెన్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వెనుక కెమెరాతో పాటు ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లతో ఉన్న విశాలమైన 5-సీటర్ క్యాబిన్‌ ఉంది. గ్రాండ్ i10 NIOS ఐదు సీట్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో క్లైమేట్ కంట్రోల్, USB ఛార్జర్‌లతో వస్తుంది. 2023 మారుతి సుజుకి Ignis ప్రారంభ ధర రూ. 5.82 లక్షలు నుండి రూ. 8.01 లక్షలు. ఇంతలో, హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ధర రూ. 5.68-8.46 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). అప్డేట్ అయిన Ignis కన్నా i10 NIOSలో స్టైలిష్ డిజైన్ తో పాటు ఎక్కువ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో తక్కువ ప్రారంభ ధర ఉంటుంది.