Page Loader
లాంచ్ కు ముందే వెబ్సైట్ లో 2023 Verna టీజర్ రిలీజ్ చేసిన హ్యుందాయ్
2023 హ్యుందాయ్ Verna బుకింగ్స్ ప్రారంభమయ్యాయి

లాంచ్ కు ముందే వెబ్సైట్ లో 2023 Verna టీజర్ రిలీజ్ చేసిన హ్యుందాయ్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 22, 2023
06:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

మార్చి 21 న భారతదేశంలో ప్రారంభించడానికి ముందు, హ్యుందాయ్ తన వెబ్‌సైట్‌లో 2023 Verna టీజర్ రిలీజ్ చేసింది. అప్డేట్ అయిన సెడాన్ అవుట్గోయింగ్ మోడల్ కు భిన్నంగా కనిపిస్తుంది. ఇది రెండు 1.5-లీటర్ బిఎస్ 6 ఫేజ్ 2-కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్లతో నడుస్తుంది. భారతీయ మార్కెట్లో ఇటీవల SUVకి పెరిగిన అదరణతో, సెడాన్ తన ప్రభావాన్ని కోల్పోయింది. ఏదేమైనా మారుతి సుజుకి సియాజ్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ ప్రస్తుత తరం Verna లాంటి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. రాబోయే Verna బ్రాండ్ 'సున్నితమైన స్పోర్టినెస్' డిజైన్ తో వస్తుంది.

కార్

భారతదేశంలో 2023 హ్యుందాయ్ Verna బుకింగ్స్ ప్రారంభమయ్యాయి

సెడాన్ లో మినిమలిస్ట్ డాష్‌బోర్డ్, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉంటాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, ADAS ఫంక్షన్ ఉంటాయి. భారతదేశంలో 2023 Verna హ్యుందాయ్ బుకింగ్స్ ప్రారంభించింది. కార్ల తయారీసంస్థ మార్చి 21న లాంచ్ కార్యక్రమంలో సెడాన్ ధర వివరాలను ప్రకటించనున్నారు. ప్రస్తుత అవుట్గోయింగ్ మోడల్ రూ. 9.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువ ధర ఉంటుంది.