మార్చి 21న విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Verna
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈరోజు మార్చి 21న భారతదేశంలో విడుదల చేయనున్న 2023 హ్యుందాయ్ Verna డిజైన్ రెండర్‌లను ఆవిష్కరించింది. కొత్త Vernaను హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది మార్కెట్లో 2023 హోండా సిటీ, స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్, మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి పోటీగా ఉంటుంది. 2023 వెర్నాలో రెండు ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి, రెండూ E20 ఫ్యూయల్-రెడీ, రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE)-కంప్లైంట్ 1.5-లీటర్ TGDi పెట్రోల్ మిల్లు ఉంది, దీనికి 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ DCT ఆటోమేటిక్‌తో వస్తాయి.
కొత్త Vernaలో EX, S, SX, SX(O) అనే నాలుగు వేరియంట్‌లు ఉంటాయి
కొత్త Vernaలో EX, S, SX, SX(O) అనే నాలుగు వేరియంట్‌లు ఉంటాయని హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించింది. ఇది ఏడు మోనోటోన్, రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. . ప్రస్తుత అవుట్‌గోయింగ్ హ్యుందాయ్ వెర్నా ధర రూ. 9.64 లక్షల నుండి రూ. 15.72 లక్షలు (ఎక్స్-షోరూమ్). 2023 హ్యుందాయ్ వెర్నా ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు వెళ్ళవచ్చు. ఈ రోజు మేము సరికొత్త హ్యుందాయ్ Verna డిజైన్ రెండర్‌లను ప్రదర్శించడంసంతోషంగా ఉంది. కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడం, ఈ విభాగంలో మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సిఈఓ అన్సూ కిమ్, అన్నారు.