Page Loader
మారుతీ సుజుకి Fronx v/s కియా Sonet ఏది కొనడం మంచిది
కియా Sonet 1.5 లక్షల కార్ల అమ్మకాల మైలురాయిని దాటింది

మారుతీ సుజుకి Fronx v/s కియా Sonet ఏది కొనడం మంచిది

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 06, 2023
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

మారుతి సుజుకి Fronx SUVని గత నెలలో భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఇందులో ఫీచర్-లోడెడ్ క్యాబిన్ తో పాటు రెండు పెట్రోల్ ఇంజన్‌ల ఆప్షన్ ఉంది భారతీయ మార్కెట్ లో ఈ SUV కియా Sonetతో పోటీపడుతోంది. భారతదేశంలో ఉన్న థన్ బ్రాండ్ డిమాండ్‌ను పెంచుకోవడానికి, మారుతి సుజుకి తన NEXA సిరీస్ కు Fronxని చేర్చింది. ఇది కొత్త తరం బాలెనో ఆధారంగా రూపొందింది. అయితే కియా Sonet ఈ సెగ్మెంట్ లో చాలా కాలంగా ఉంది ఇటీవలే 1.5 లక్షల కార్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది.

కార్

అధునాతున ఫీచర్‌లతో పాటు ఎక్కువ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్న కియా Sonet కొనడం మంచిది

మారుతి సుజుకి Fronx 1.2-లీటర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్ తో 1.0-లీటర్ బూస్టర్ జెట్ టర్బో-పెట్రోల్ మిల్లుతో నడుస్తుంది, ఇందులో 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి. కియా Sonet 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మిల్లు, 1.5-లీటర్ డీజిల్ మోటారుతో వస్తుంది. మారుతి సుజుకి Fronx ధర సుమారు రూ. 8 లక్షలు, కియా Sonet ధర రూ. 7.69 లక్షలు నుండి రూ. 14.39 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ఉంటుంది. కియా Sonet కొనడం మంచిది ఎందుకంటే అధునాతున ఫీచర్‌లతో పాటు ఎక్కువ ఇంజిన్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి.