భారతదేశంలో 2023 మారుతి సుజుకి Fronx బుకింగ్స్ ప్రారంభం
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త -SUV, Fronxని మార్కెట్ లో విడుదల చేయబోతుంది. కాంపాక్ట్ SUV కోసం బుకింగ్స్ ప్రారంభం కావడమే కాదు ఇప్పటికే 5,000 ప్రీ-ఆర్డర్‌లు కూడా వచ్చాయి. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ఐదు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది. మారుతి సుజుకి తన Fronx ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆటోమొబైల్ రంగం ఆశ్చర్యానికి గురి అయింది. బాలెనో అప్డేట్ చేసిన హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా SUV కాంపాక్ట్ డిజైన్ తో , టెక్-ఫార్వర్డ్ క్యాబిన్ రైడ్ వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది NEXA డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది.
మార్కెట్ లో హ్యుందాయ్ VENUE, కియా Sonet, Renault Kiger వంటి వాటికి పోటీగా ఉంటుంది. మారుతి సుజుకి Fronx ఎంట్రీ-లెవల్ సిగ్మా వేరియంట్ 1.2-లీటర్ DualJet పెట్రోల్ ఇంజన్ పై నడుస్తుంది. డెల్టా వేరియంట్ సిగ్మా ట్రిమ్, డెల్టా+ వేరియంట్ 1.2-లీటర్ DualJet పెట్రోల్ ఇంజన్ లేదా 1.0-లీటర్ BoosterJet టర్బో-పెట్రోల్ యూనిట్ పై నడుస్తుంది. జెటాలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక కెమెరా ఉన్నాయి.1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. మారుతి సుజుకి Fronx ధరకు సంబంధించిన వివరాలను వాహన తయారీ సంస్థ త్వరలో వెల్లడిస్తుంది. భారతదేశంలో దీని ప్రారంభ ధర దాదాపు రూ. 8 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది NEXA డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది.