భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన 2023 హ్యుందాయ్ VENUE
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారతదేశంలో VENUE 2023 అప్‌డేట్ ను లాంచ్ చేసింది. ఈ వెర్షన్ ఇప్పుడు RDE-కంప్లైంట్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో పాటు నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. ఇది ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది: E, S, S(O), SX, SX(O). 2019 నుండి భారతదేశంలో హ్యుందాయ్ కార్లలో ప్రజాదరణ పొందిన కార్లలో VENUEఒకటి. మార్కెట్ లో కాంపాక్ట్ SUV విభాగంలో మారుతి సుజుకి Brezza, టాటా Nexon వంటి కార్లతో పోటీపడుతుంది. ఈ 2023 అప్డేట్ Real Driving Emission నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ప్రయాణీకుల భద్రత కోసం నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ESCతో పాటు వెనుక కెమెరా ఇందులో ఉంటుంది.
హ్యుందాయ్ తన CRETA, ALCAZAR కార్లను కూడా భారతదేశంలో RDE నిబంధనలకు అనుగుణంగా మార్చింది
భారతదేశంలో, 2023 హ్యుందాయ్ VENUE బేస్ E 1.2 MT వేరియంట్ ధర రూ. 7.68 లక్షలు, రేంజ్-టాపింగ్ SX(O) 1.0 DCT ట్రిమ్ ధర రూ. 12.96 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). దీనిని ఆన్‌లైన్‌లో లేదా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. భారతదేశంలోని హ్యుందాయ్ Real Driving Emission నిబంధనలకు అనుగుణంగా తన మిడ్-సైజ్ కార్లు CRETA, ALCAZARని కూడా అప్‌డేట్ చేసింది. ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, సీట్‌బెల్ట్ ఎత్తు సరిచేయడం, ISOFIX వంటి ఫీచర్లతో ఇవి రెండు అందుబాటులో ఉన్నాయి.