ఉద్యోగుల తొలగింపు: వార్తలు
22 Mar 2023
ఫేస్ బుక్ఫేస్బుక్ మోడరేటర్ల తొలగింపునకు నిరోధించిన కెన్యా కోర్టు
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాతో ఒప్పందం కుదుర్చుకున్న 'సామ' ఔట్‌సోర్సింగ్ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 260 మంది కంటెంట్ మోడరేటర్ల తొలగింపు ప్రక్రియకు కెన్యా కోర్టు బ్రేక్ వేసింది.
21 Mar 2023
అమెజాన్మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్
మరో రౌండ్ ఉద్యోగ కోతలు ప్రారంభించిన టెక్ దిగ్గజం అమెజాన్ తమ AWS క్లౌడ్ యూనిట్, ట్విచ్ గేమింగ్ డివిజన్, అడ్వర్టైజింగ్, PXT (అనుభవం, సాంకేతిక పరిష్కారాలు) ఆర్మ్ వంటి వివిధ వ్యాపార విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 9,000 ఉద్యోగులను తొలగిస్తోంది.
11 Mar 2023
మైక్రోసాఫ్ట్ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ
దాదాపు 480 టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించే చర్యలను అమలు చేయడంతో ఈ ఏడాదిలోనే 1.2 లక్షల మంది ఉద్యోగులు తొలగింపులకు గురి అయ్యారు, తొలగింపులు జాబ్ మార్కెట్‌ను అస్థిరంగా మార్చాయి. వర్క్ వీసాలపై విదేశాలలో నివసిస్తున్న భారతీయులు దీని వలన తీవ్రంగా దెబ్బతిన్నారు.
07 Mar 2023
ప్రకటనఎడ్టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం
ఎడ్‌టెక్ సంస్థ upGrad దాని అనుబంధ సంస్థ 'క్యాంపస్'లో 30% మంది ఉద్యోగులను తొలగించింది. upGrad ఈ ఏడాది ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి.
07 Mar 2023
మెటాఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా
ఫేస్ బుక్-పేరెంట్ సంస్థ మెటా ఈ వారంలో మరిన్ని ఉద్యోగ కోతలు గురించి కంపెనీ ఆలోచిస్తుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. నవంబర్‌లో 11,000 ఉద్యోగులను అంటే సిబ్బందిలో 13% మందిని తొలగించారు. మెటా 2022 ఆర్థిక అనిశ్చితి, పడిపోతున్న ప్రకటన ఆదాయంతో టిక్‌టాక్‌తో పోటీ పడుతుంది.
06 Mar 2023
ఉద్యోగంఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్
ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్ జూమ్ ఒక నెల క్రితం సిబ్బందిలో 15% మందిని తొలగించింది. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించినట్లు సమాచారం.
03 Mar 2023
ఉద్యోగులువేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు
వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ఉద్యోగ కోతలు ప్రారంభించాయి. 2022 సంవత్సరంలో మొదలైన ఉద్యోగుల తొలగింపుల సీజన్ 2023లో కూడా కొనసాగుతుంది. ఇంకా సంవత్సరంలో మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
27 Feb 2023
టెలికాం సంస్థజనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి
కేవలం రెండు నెలల్లోనే 417 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 1.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, 2022లో 1,046 టెక్ కంపెనీలు అంటే పెద్ద సంస్థల నుండి స్టార్టప్‌ల వరకు 1,61 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఒక్క జనవరిలోనే, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తో పాటు ఇతర సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు.
25 Feb 2023
టెలికాం సంస్థ8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ
టెక్ పరిశ్రమ తరువాత, టెలికాం తయారీ రంగం కూడా ఉద్యోగ కోతలను మొదలుపెట్టింది. . స్వీడన్ 5 జి నెట్‌వర్క్స్ తయారీ సంస్థ ఎరిక్సన్ ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో 8,500 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీనివలన సంస్థలో సుమారు 8% మంది ప్రభావితమవుతారు.
25 Feb 2023
గూగుల్మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు
గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ రహస్య X మూన్‌షాట్ ల్యాబ్ నుండి గ్రాడ్యుయేట్ అయిన ఒక సంవత్సరం తర్వాత దాని అతి చిన్న అనుబంధ సంస్థల్లో ఒకటైన ఎవ్రీడే రోబోట్‌లను తొలగించాలని నిర్ణయించుకుంది. డిపార్ట్‌మెంట్‌లో అనేక ప్రయోజనాత్మక ప్రాజెక్టులలో పనిచేసే 200 మందికి పైగా సభ్యులు ఉన్నారు.
23 Feb 2023
మెటామెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం
వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, మెటాలో నాన్-ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఈసారి ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. గత సంవత్సరం, మెటా తన ఖర్చులను తగ్గించుకోవడానికి,ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి 13% మంది ఉద్యోగులను అంటే దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది.
22 Feb 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన దిగ్గజ కంపెనీ 'మెకిన్సీ'
మరో అంతర్జాతీయ సంస్థ తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. దిగ్గజ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే & కో తన కంపెనీలోని దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ తొలగింపు జాబితాలో క్లయింట్లతో ప్రత్యేక్షంగా సంబంధం లేని వారు మాత్రమే ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
21 Feb 2023
మెటామరిన్ని ఉద్యోగ కోతలకు ప్రణాళిక వేస్తున్న మెటా 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్స్
మెటాలో ఉద్యోగ కోతల సీజన్ ఇంకా పూర్తి కాలేదు. ఇటీవల ముగిసిన పనితీరు సమీక్షలలో సుమారు 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్‌లు ఇవ్వడం ద్వారా కంపెనీ ఇటువంటి సంకేతాలను అందించింది. గత ఏడాది నవంబర్‌లో మెటా దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది.
15 Feb 2023
ఆటో మొబైల్ఐరోపాలో 3,800 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్
వచ్చే మూడేళ్లలో యూరప్‌లో 3,800 ఉద్యోగాలను తగ్గించాలని అమెరికా వాహన తయారీ సంస్థ ఫోర్డ్ నిర్ణయాన్ని ప్రకటించింది. పెట్రోలు, డీజిల్ ఇంజన్‌ల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారుతుండడంతో ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి. ఫోర్డ్ లో ప్రస్తుతం ఐరోపాలో 34,000 ఉద్యోగులు ఉన్నారు. 2035 నాటికి ఐరోపాలో తన విమానాలను పూర్తిగా విద్యుదీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిపై $50 బిలియన్లను ఖర్చు చేస్తోంది.
13 Feb 2023
మెటామరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా
మరింత మందిని ఉద్యోగాల్లోంచి తొలగించే ఆలోచనలో ఉన్న మెటా సంస్థ. ఫేస్‌బుక్ పేరెంట్ సంస్థ మెటా వచ్చే నెలలో సిబ్బంది పనితీరు సమీక్షలను పూర్తి చేసిన తర్వాత సంస్థను పునర్నిర్మించనున్నట్లు తెలిపింది.
11 Feb 2023
మైక్రోసాఫ్ట్ఉద్యోగ తొలగింపులు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్ HoloLens, Surface, Xboxలో ఉద్యోగ కోతలు
మైక్రోసాఫ్ట్ గత నెలలో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దానిలో భాగంగా, ఇప్పుడు HoloLens మిక్స్డ్ రియాలిటీ హార్డ్‌వేర్, Surface డివైజ్ తో పాటు Xbox గేమింగ్ డివిజన్ యూనిట్లలో ఉద్యోగాలను తగ్గించింది.
11 Feb 2023
టిక్ టాక్భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్
2020లో భారతదేశంలో నిషేదించిన షార్ట్ వీడియో ప్లాట్ఫాం టిక్‌టాక్ దేశంలోని తన కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంది. సంస్థలో మిగిలిన 40 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసింది.
10 Feb 2023
ప్రపంచం1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ
యాహూ తన మొత్తం సిబ్బందిలో 20% కంటే ఎక్కువ మందిని తొలగించాలని ఆలోచిస్తున్నట్లు గురువారం ప్రకటించింది, దాదాపు 50% యాడ్ టెక్ ఉద్యోగులపై ఈ ప్రభావం ఉంటుంది రికార్డు స్థాయిలో అధిక ద్రవ్యోల్బణంతో పాటు మాంద్యం భయంతో కంపెనీలు టెక్ రంగంలో విస్తృతంగా ఉద్యోగ కోతలను ప్రకటిస్తున్నాయి.
09 Feb 2023
టెక్నాలజీ7,000 మంది ఉద్యోగుల తొలగించనున్న డిస్నీ
డిస్నీ సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి 7,000 మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. ఇటీవలే తమ త్రైమాసిక ఆదాయాన్ని ప్రకటించిన వెంటనే ఈ నిర్ణయం ప్రకటించింది.
08 Feb 2023
సంస్థఇంటెల్ సిఈఓ బాటలో జూమ్ సిఈఓ, తన వేతనంలో 98% కోత విధింపు
జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ మంగళవారం తన 15% అంటే దాదాపు 1,300 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. జూమ్ సిఈఓ ఎరిక్ యువాన్ తొలగింపులకు దారితీసిన పరిస్థితులకు తాను బాధ్యత వహిస్తానని, రాబోయే ఆర్థిక సంవత్సరానికి తన జీతం 98% తగ్గించడంతో పాటు కార్పొరేట్ బోనస్‌ను వదులుకుంటున్నానని చెప్పారు.
07 Feb 2023
ప్రకటనఅసెస్మెంట్ పరీక్షలో ఫెయిలైన 600 ఫ్రెషర్స్ ను తొలగించిన ఇన్ఫోసిస్ సంస్థ
ఇంటర్నల్ ఫ్రెషర్స్ అసెస్‌మెంట్ (FA) పరీక్షలో ఫెయిలైన కారణంగా ఇన్ఫోసిస్ 600 మంది ఫ్రెషర్లను తొలగించింది. గత నెలలో, దేశంలోని మరో ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కూడా ఇలానే 450 మంది ఫ్రెషర్లను తొలగించింది.
01 Feb 2023
టెక్నాలజీఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత
కాలిఫోర్నియాలోని ఫోల్సమ్ క్యాంపస్‌లో సుమారు 340 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, వేతన కోతలను అమలు చేసినట్లు ఇంటెల్ సంస్థ తెలిపింది. ఈ తగ్గింపులు మిడ్-లెవల్ ఉద్యోగుల నుండి ఎగ్జిక్యూటివ్ వరకు ఉంటాయి. కంపెనీ ఆదాయం వేగంగా పడిపోవడంతో, సంస్థ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
31 Jan 2023
మెటామెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం
మెటా గత సంవత్సరం, 11,000 మంది ఉద్యోగులను అంటే సిబ్బందిలో 13% మంది ఉద్యోగులను తొలగించింది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ ప్రస్తుతం మెటా సంస్థాగత నిర్మాణంపై అసంతృప్తిగా ఉన్నారు. దానికి కారణం మానేజ్మెంట్ లో వివిధ టీంలు ఉండడం. ఖర్చులను తగ్గించే ఆలోచనలో ఉన్న జుకర్‌బర్గ్ మరికొన్ని తొలగింపులను దృష్టిలో ఉంచుకున్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.
30 Jan 2023
సంస్థమరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ
డచ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ ఫిలిప్స్ 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. స్లీప్ అప్నియా ట్రీట్‌మెంట్ డివైజ్‌లను వెనక్కి రప్పించడంతో కంపెనీ నష్టాల బారిన పడింది. దీని కారణంగా ఫిలిప్స్ తన మార్కెట్ వాల్యుయేషన్‌లో 70% కోల్పోయింది. గత ఏడాది అక్టోబర్‌లో సంస్థ ప్రకటించిన 4,000 మంది ఉద్యోగుల తొలగింపుకు అదనంగా మరో 6,000 మందిని తొలగించబోతుంది.
28 Jan 2023
గూగుల్ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన
ఈ నెల ప్రారంభంలో, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో సిబ్బందిని తొలగించిన కంపెనీల లిస్ట్ లో గూగుల్ చేరింది. గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని తీసుకున్న నిర్ణయం చాలామంది జీవితాలను తలకిందులు చేసింది. ఇది బాధిత ఉద్యోగుల నుండి వ్యతిరేకతకు దారితీసింది.
27 Jan 2023
ప్రపంచంఉద్యోగ కోతల లిస్ట్ లో చేరిన మరో సాఫ్ట్వేర్ దిగ్గజం SAP, 3,000 మంది తొలగింపు
జర్మన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం SAP కూడా ఉద్యోగులను తొలగించే టెక్ కంపెనీల లిస్ట్ లో చేరింది. సంస్థ 3,000 మందిని అంటే ప్రపంచవ్యాప్తంగా 2.5%మంది సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.