ఓఎల్ఎక్స్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. 800 మందికి పైగా ఇంటిబాట
ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్, క్లాసిఫైడ్ పోర్టల్ ఓఎల్ఎక్స్ గ్రూప్‌లో మళ్లీ లే ఆఫ్ ప్రక్రియ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సూమారు 800 మంది ఉద్యోగుల తొలగింపునకు ఓఎల్ఎల్స్ గ్రూప్ రంగం సిద్ధం చేసింది. అదే విధంగా జనాదరణ లేని కొన్ని మార్కెట్లో ఆటోమోటివ్ యూనిట్ ఓఎల్‌ఎక్స్ ఆటోస్ ను మూసివేసే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓఎల్ఎక్స్ గ్రూప్‌లోని అన్ని విభాగాల్లో, అన్ని మార్కెట్లో లే ఆఫ్ ప్రక్రియ ఉండనుంది. ఉద్యోగం నుంచి తొలగించే విషయాన్ని ముందే ఉద్యోగులను తెలియజేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఆమ్ స్టర్ డామ్ లో ఉంది.
గతంలో 1500 ఉద్యోగులను తొలిగించిన ఓఎల్ఎక్స్
ఇప్పటికే అర్జెంటీనా, మెక్సికో, కొలంబియా దేశాల్లో ఓఎల్‌ఎక్స్ గ్రూప్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. వివిధ దేశాల్లో సేల్స్ ఆధారంగా బిజినెస్‌లో మార్పులు ఉంటాయని ఓఎల్ఎక్స్ గ్రూప్ స్పష్టం చేసింది. ఓఎల్ఎక్స్ గ్రూప్‌లో లే ఆఫ్ ను గతంలో కూడా విధించారు. మొత్తం ఉద్యోగుల్లో 15శాతం మంది తొలిగిస్తామని ఈ జనవరి నెలలో సంస్థ వెల్లడించింది. ఆ సమయంలో దాదాపు 1500 ఉద్యోగులు ఇంటి బాట పట్టారు. మార్చి 31, 2022 నాటికి ఓఎల్ఎక్స్ గ్రూప్‌లో సూమారు 11,375 మంది ఉద్యోగులున్నారు.