Page Loader
బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు 
బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు

బైజూస్‌లో ఆగని ఉద్యోగాల కోత; మరో 1,000 మంది తొలగింపు 

వ్రాసిన వారు Stalin
Jun 20, 2023
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్‌ మరో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఈ సారి అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అమెరికాకు చెందిన ఒక కంపెనీకి బైజూస్ 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంది. ఈ రుణంలో విషయంలో బైజూస్ న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టడం గమనార్హం. తాజాగా చేపట్టిన ఉద్యోగాల కోత కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 2శాతం ఉంటుందని వార్తా సంస్థల నివేదికలు చెబుతున్నాయి.

బైజూస్

ప్రస్తుతం బైజూస్‌లో 50వేల మంది ఉద్యోగులు 

బైజూస్‌ ఇప్పటికే రెండు విడతల్లో లేఆఫ్స్‌ను ప్రకటించింది. అందులో భాగంగా 3,000 కంటే ఎక్కువ ఉద్యోగులను తొలగించింది. ఈ క్రమంలో ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఖర్చును తగ్గించే చర్యలకు అనుగుణంగా తాజాగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బైజూస్‌లో ఉద్యోగులు 50వేల మంది ఉన్నారు. వీరు ఎక్కువ మంది కొత్తగా కంపెనలో చేరిన వారే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బైజూస్ లాభాల బాటపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగానే పని చేస్తోంది. భారతదేశంలోని అతిపెద్ద స్టార్టప్‌లలో ఒకటైన బైజూస్ కంపెనీ విలువ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లు. ఇటీవల అనేక సమస్యలతో ఇబ్బందిపడుతున్న బైజూస్ విలువ రానురానూ తగ్గుతూ వస్తోంది.