
Cognizant: ఐటీ ఉద్యోగులకు చేదువార్త.. లేఆఫ్స్ జాబితాలోకి కాగ్నిజెంట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక మాంద్య భయాలు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు మాంద్యం కారణంగా చాలా కష్టాలు పడుతున్నాడు.
పెద్ద టెక్ కంపెనీలైన మైక్రోసాప్ట్, గూగుల్, యాక్సెంచర్, ఇప్పటికే చాలామంది ఉద్యోగులను తొలిగించింది. ఈ జాబితాలోకి మరో టెక్ సంస్థ కాగ్నిజెంట్ కూడా చేరింది.
2023లో తమ ఆదాయాలు తగ్గుముఖం పట్టడంతో కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
తగ్గిన ఆదాయాల ఖర్చులను తగ్గించుకొనేందుకు కాగ్నిజెంట్ 3500 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది.
కాగ్నిజెంట్ కు ప్రధాన ఆదాయం యూఎస్ నుంచి వస్తోంది. యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలతో పోటీ కారణంగా కాగ్నిజెంట్ చాలా కష్టపడుతోంది.
Details
ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను తొలిగిస్తున్న టెక్ కంపెనీలు
ముఖ్యంగా కాగ్నిజెంట్ ఆదాయం తగ్గించుకోవడం కోసం భారతదేశంలోనే పెద్ద నగరాల్లో 11 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను కూడా వదులుకోవడం విశేషం. కొత్తగా వచ్చిన సీఈఓ రవికుమార్ వచ్చి రాగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని తీసుకున్నారు.
టెక్ కంపెనీలు పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాల్లో ఉద్యోగులను తొలిగిస్తున్నారు. ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా రెండుసార్లు వేలల్లో ఉద్యోగులను తీసేసిన విషయం తెలిసిందే.
బెంగళూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షేర్ చాట్ 20శాతం ఉద్యోగులను తొలిగించింది. అమెజాన్ 1800, గూగుల్ 12000, మైక్రోసాప్ట్ 10,000, ట్విట్టర్ 50శాతం మందిని తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.