50శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్న 'క్లబ్‌హౌస్'
ఈ వార్తాకథనం ఏంటి
ఆడియో ఆధారిత సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ 'క్లబ్‌హౌస్' 50 శాతం మంది ఉద్యోగుల తొలగింపును చేపట్టినట్లు ప్రకటించింది.
కోవిడ్ సమయంలో ప్రజల ఒంటరి తనాన్ని దూరం చేసేందుకు తీసుకొచ్చిన యాప్ విశేష ప్రజాధారణ పొందింది.
మహమ్మారి వల్ల ప్రజలు ఒకరికొకరు దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు, క్లబ్‌హౌస్ యాప్ ఒక పరిష్కారాన్ని మార్గాన్ని చూపింది. ఇప్పుడు కరోనా తొలగిపోయి.. స్థాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో 'క్లబ్‌హౌస్' వినియోగం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
దీంతో కంపెనీలో 50శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు క్లబ్‌హౌస్ సహ-వ్యవస్థాపకులు పాల్ డేవిసన్, రోహన్ సేథ్ కంపెనీ షేర్ చేసిన ఈమెయిల్‌లో వెల్లడించారు.
ఉద్యోగులు
'క్లబ్‌హౌస్ 2.0'పై కంపెనీ దృష్టి
ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదని పాల్ డేవిసన్, రోహన్ సేథ్ తమ ఈ మెయిలో చెప్పారు. కంపెనీని రీసెట్ చేయడానికి ఈ తొలగింపులను చెపట్టినట్లు పేర్కొన్నారు.
ఒకప్పుడు 4 బిలియన్ డాలర్ల విలువ కలిగిన క్లబ్‌హౌస్, ప్రపంచ దేశాలు 2021 చివరి నాటికి లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఈ యాప్ డౌన్ ఫాల్ మొదలైంది. 2022లో వినియోగదారుల ఆసక్తిని గణనీయంగా కోల్పోయింది.
ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. లాక్ డౌన్ పరిస్థితులు లేకపోవడంతో 'సాధారణ' జీవితానికి తిరిగి రావడం ప్రారంభించిన తర్వాత, క్లబ్‌హౌస్ అందించే వర్చువల్ గదులపై వినియోగదారులు క్రమంగా ఆసక్తిని కోల్పోయారు. 'క్లబ్‌హౌస్ 2.0'పై కంపెనీ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.