Intel Layoffs:USలో 2,000 మంది ఉద్యోగులను తొలగించిన ఇంటెల్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి.
కంపెనీల వ్యాపారాలు ఊహించిన స్థాయిలో వృద్ధిని చూడకపోవటంతో ఉద్యోగుల కోతలతో లాభదాయకతను మెరుగుపరుచుకునేందుకు సదరు కంపెనీలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి.
దాదాపు రెండేళ్లకు పైగా కరోనా తర్వాత గడిచిపోయినప్పటికీ, కంపెనీల్లో కోతలు ఆగకపోవటం పరిశ్రమవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆందోళనలను పెంచిస్తున్నాయి.
వివరాలు
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నఉద్యోగుల తొలగింపు
లేటెస్ట్ గా అమెరికాలోని క్యాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్నచిప్ తయారీదారు ఇంటెల్ మాస్ లేఆఫ్స్ ప్రకటించింది.
దీని కింద అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న దాదాపు 2000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం.
వాస్తవానికి, ఖర్చుల మదింపు కారణంగా ఈ తొలగింపులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే, ఒరెగాన్‌లో దాదాపు 1,300 మంది ఉద్యోగులు, అరిజోనాలో 385 మంది, కాలిఫోర్నియాలో 219 మంది, టెక్సాస్‌లో 251 మంది ఉద్యోగులకు కోతలు జరుగుతున్నట్లు వార్తా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఆగస్టుకు ముందు కంపెనీ ప్రకటించిన 15,000 తొలగింపుల్లో భాగంగా ప్రస్తుత తొలగింపులు జరుగుతున్నాయని ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ తెలిపారు.
వివరాలు
మలేషియాలోని తయారీ యూనిట్‌ను హోల్డ్ లో ఉంచాలని నిర్ణయం
ఖర్చులను తగ్గించుకోవడానికి, చిప్-మేకింగ్ విభాగాన్ని పెంపొందించడానికి కొత్త దశలను వేస్తూ, ఇంటెల్ తన చిప్-తయారీ, డిజైన్ కార్యకలాపాలను వేరు చేస్తుందని సెప్టెంబర్‌లో గెల్సింగర్ ప్రకటించారు.
ఈ విభజన కారణంగా అవి స్వతంత్రంగా ఫైనాన్సింగ్ పొందగలవని, కాంట్రాక్ట్ చిప్ మేకర్‌తో మరింత సాంస్కృతికంగా పని చేయగలదన్నారు.
ఈ క్రమంలో, కంపెనీ జర్మనీ, పోలాండ్ ఫ్యాక్టరీల్లో ప్రాజెక్టులను రెండేళ్ల పాటు నిలిపివేస్తోంది.
డిమాండ్ తిరిగి పెరిగేంతవరకు మలేషియాలోని తయారీ యూనిట్‌ను హోల్డ్ లో ఉంచాలని నిర్ణయించింది.
2025లో ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రాంతీయ ఎంగేజ్మెంట్ మోడళ్లను అమలు చేసేందుకు అనుభవజ్ఞుడైన డేవ్ గుజ్జీని బోర్డులోకి తీసుకొచ్చినట్లు తెలిసిందే.
వివరాలు
మెటా లేఆఫ్స్
అమెరికాకు చెందిన మెటా కూడా తన లేఆఫ్'స్ ని కొనసాగిస్తూనే ఉంది. 2022 నుండి వరుసగా ఐదవసారి టెక్ దిగ్గజం తన తొలగింపులను కొనసాగిస్తోంది.
అమెరికాలో ద్రవ్యోల్బణం కుదుటపడటంతో, ఇటీవల ఫెడ్ చర్యలు ప్రపంచ వ్యాప్తంగా జాబ్ మార్కెట్లలో కొత్త ఉత్సహాన్ని నింపాయి.
ఈ క్రమంలో రిక్రూట్మెంట్లు కూడా భారీగా పెరిగాయి. మెటా గతంలో సోషల్ మీడియా విభాగంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
తాజాగా, కంపెనీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, రియాలిటీ ల్యాబ్‌లతో సహా వివిధ విభాగాలలో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.
ఈ కోతలు నిర్దిష్ట జట్లలో పునర్నిర్మాణానికి సంబంధించాయని సమాచారం.