Meta: మెటాలో ఉద్యోగుల తొలగింపు చట్టవిరుద్ధం
కొంతకాలంగా దిగ్గజ టెక్ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్(X) మెటా వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించారు. తాజాగా 2022లో మెటా కంపెనీలో జరిగిన ఉద్యోగుల తొలగింపు చట్టవిరుద్ధమని యూఎస్ న్యాయమూర్తి స్పష్టం చేశారు. జాతీయ కార్మిక సంబంధాల చట్టం ప్రకారం ఉద్యోగుల హక్కులను ఉల్లంఘించారని నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ (NLRB) అడ్మినిస్ట్రేటివ్ లా జడ్జి ఆండ్రూ గొల్లిన్ పేర్కొన్నాడు.
నవంబర్ 2022లో భారీగా ఉద్యోగుల తొలగింపు
సమస్యాత్మకమైన ఒప్పందాలలో సంతకం చేసిన ఉద్యోగులందరినీ సంప్రదించి ఏం జరిగిందో తెలియజేయాలని న్యాయమూర్తి మెటాను ఆదేశించారు. విభజన ఒప్పందంపై సంతకం చేసిన మెటా ఉద్యోగుల్లో ఒకరైన డేవిడ్ జేమ్స్ కార్ల్‌సన్ దీనిపై ఫిర్యాదు చేశారు. NLRB ప్రకారం, సుమారు 7,511 మంది మాజీ మెటా ఉద్యోగులు ఒప్పందాలను సమర్పించినట్లు తెలిసింది. వీరిలో ఎక్కువ మందిని నవంబర్ 2022లో తొలగించారు. డేవిడ్ జేమ్స్ కార్ల్‌సన్‌తో సహా 7,236 మంది మెటా ఉద్యోగులు ఒప్పందంపై సంతకం చేశారని NLRB తెలిపింది.