Page Loader
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాలరీ హైక్ లేదు; బోనస్‌ బడ్జెట్‌ తగ్గింపు
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాలరీ హైక్ లేదు; బోనస్‌ బడ్జెట్‌ తగ్గింపు

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాలరీ హైక్ లేదు; బోనస్‌ బడ్జెట్‌ తగ్గింపు

వ్రాసిన వారు Stalin
May 11, 2023
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఆధారిత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలను పెంచడం లేదని ప్రకటించింది. బోనస్‌లు, స్టాక్ అవార్డుల బడ్జెట్‌ను కూడా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. సీఈఓ సత్య నాదెళ్ల అంతర్గత ఇమెయిల్‌ను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ మేరకు నివేదించింది. అయితే ఈ మెయిల్‌పై మైక్రోసాఫ్ట్ స్పందించలేదు. గత సంవత్సరం మార్కెట్ పరిస్థితులు, కంపెనీ పనితీరు విషయంలో గణనీయమైన పెట్టుబడి పెట్టినట్లు సత్య నాదెళ్ల ఆ మెయిల్ అన్నట్లు తెలుస్తోంది. తమ గ్లోబల్ మెరిట్ బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేసినట్లు, అయితే ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చెప్పినట్లు సమచారం.

మైక్రోసాఫ్ట్

ఏఐ అభివృద్ధిపై మైక్రోసాఫ్ట్ ప్రత్యేక దృష్టి

ఆర్థికమాంద్యం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ 10,000 మంది కార్మికులను తొలగించనున్నట్లు జనవరిలో చెప్పింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అనేక టెక్ కంపెనీలు లే ఆఫ్స్‌ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని సంస్థ లింక్డ్ఇన్ 716 మంది ఉద్యోగులను తొలగించింది. అంతేకాకుండా తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (జీఓబీ)లో మార్పులు చేయడంతో పాటు చైనాలో తన ఇన్ కెరీర్ యాప్‌ను మూసివేసింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు జీఓబీ CEO ర్యాన్ రోస్లాన్స్కీ ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు దాని దృష్టంతా ఏఐపైనే ఉంది. ఏఐను మైక్రోసాఫ్ట్ వ్యూహాత్మకంగా భావిస్తోంది.