TikTok Layoffs: సోషల్ మీడియా సంస్థ టిక్‌టాక్‌లో లేఆఫ్‌లు.. 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన
ఈ వార్తాకథనం ఏంటి
ముందుగా మాంద్యం భయాలతో లేఆఫ్‌లు ప్రకటించిన సంస్థలు ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవడానికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను కారణంగా చూపిస్తూ ఉద్యోగులను ఉద్వాసన పలుకుతున్నాయి.
ఈ క్రమంలో, ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ (TikTok) ఇటీవల పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.
ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. మలేషియా సహా ప్రపంచ వ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న 700 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపింది.
వివరాలు
లేఆఫ్‌లకు సంబంధించిన ఈ-మెయిల్స్
ఇప్పటికే చాలామందికి లేఆఫ్‌లకు సంబంధించిన ఈ-మెయిల్స్ అందినట్లు సమాచారం.
ఉద్యోగులను తొలగించిన విషయాన్ని టిక్‌టాక్ ధృవీకరించినప్పటికీ, ఎంతమందిని తొలగించిందన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.
టిక్‌టాక్ ప్రతినిధి తెలిపిన ప్రకారం, కంపెనీ వ్యూహాత్మక చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
కంటెంట్ మోడరేషన్ కోసం గ్లోబల్ ఆపరేషన్ మోడల్‌ను బలోపేతం చేయడం కోసం చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ ఉద్యోగుల తొలగింపు ఒక భాగమని పేర్కొన్నారు.
వివరాలు
కంటెంట్, మార్కెటింగ్ విభాగాల్లో తొలగింపులు
ఈ ఏడాది మేలో కూడా టిక్‌టాక్ ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.
ముఖ్యంగా కంటెంట్, మార్కెటింగ్ విభాగాల్లో ఈ తొలగింపులు జరిగాయి.
త్వరలోనే మరొక రౌండ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగనున్నట్లు తెలుస్తోంది.
టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ నగరాల్లో 1,10,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.