Page Loader
నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో 19 మంది స్టాఫర్ల తొలగింపు..ఆర్థిక మాంద్యంతో మాతృసంస్థ డిస్నీ నిర్ణయం
ఆర్థిక మాంద్యం వల్లే మాతృసంస్థ డిస్నీ నిర్ణయం

నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో 19 మంది స్టాఫర్ల తొలగింపు..ఆర్థిక మాంద్యంతో మాతృసంస్థ డిస్నీ నిర్ణయం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 29, 2023
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌ పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ మేరకు సంస్థలు పొదుపు సూత్రాన్ని అమలు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఉద్యోగులపై భారీ కోతలు విధిస్తున్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌ లోనూ ఉద్యోగులకు కోత తప్పలేదు. ప్రకృతిని, ప్రపంచ అందాలను, భౌగోళిక ప్రదేశాలను చూపించే ఈ సంస్థలో తాజాగా 19 మంది స్టాఫర్లను తప్పించింది. ఈ మేరకు ప్రచురణనూ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.దీంతో మ్యాగజైన్‌ పాఠకులకు అందుబాటులో ఉండదు. మరోవైపు ఆడియో విభాగంలోనూ కొంతమంది ఉద్యోగులను తొలగించింది. 1888లో తొలి ప్రచురణను ప్రారంభించిన నేషనల్‌ జియోగ్రాఫికల్‌ మ్యాగజైన్ చివరగా 19 స్టాఫ్ రిపోర్టర్లపై వేటు వేసింది.

DETAILS

డిస్నీ అధీనంలోకి వెళ్లిన నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌ 

సైన్స్‌, సహజత్వాన్ని అందించేందుకే ఈ సంస్థ ముందుండేది. కొంతకాలం క్రితం ఈ సంస్థ డిస్నీ అధీనంలోకి వెళ్లిపోయింది. అనంతరం డిస్నీ క్రమంగా సిబ్బంది సంఖ్యను కుదిస్తూ వస్తోంది. చివరగా మిగిలిన స్టాఫ్‌ రిపోర్టర్లను సైతం తాజాగా తొలగించి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలో సంస్థతో అనుబంధం ఉన్న పలువురు జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల్లో భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాగజైన్‌ ప్రస్తుత మాతృ సంస్థ డిస్నీ విధానపరమైన నిర్ణయాల్లో భాగంగానే నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌లో మరో దఫా ఉద్యోగుల తొలగింపు జరిగింది. తొలిసారిగా 2015లో ఆరుగురు టాప్‌ ఎడిటర్లకు పింక్ స్లిప్ ఇచ్చింది. వీడియో ఫార్మాట్ మీడియాను తట్టుకుంటూ నిలదొక్కుకునేందుకు కృషి చేసింది. ఈ క్రమంలోనే డిస్నీ స్టాఫ్‌ రిపోర్టర్లను తొలగించి ఫ్రీలాన్సర్లను నియమిస్తుండటం గమనార్హం.