ఉద్యోగులకు షాకిచ్చిన అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ.. 3 వేల మందిని తొలగించిన ఫోర్డ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక రంగాల్లోని కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతో దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, గూగుల్, అమెజాన్ వేల సంఖ్యలో లే ఆఫ్స్ ఇస్తున్నాయి.
మాంద్యం ధాటికి ఆదాయం తగ్గడం కారణంగా నిర్వహణ ఖర్చును తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.
మరికొన్ని కంపెనీలు సైతం ఇదే దారిలో నడుస్తున్నాయి. విడతల వారీగా ఉద్యోగులకి పింక్ స్లిప్స్ ఇస్తున్నాయి.
ఇప్పటి వరకు కేవలం ఐటీ, ఈ కామర్స్ సంస్థలు మాత్రమే లేఆఫ్ లు ప్రకటించాయి.
తాజాగా ఈ లిస్ట్ లోకి అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ వచ్చి చేరింది. సంస్థలోని ఉద్యోగులకు లేఆఫ్ లు విధిస్తున్నామని సంస్థ వెల్లడించింది.
DETAILS
ఫోర్డ్ వాహనాలకు డిమాండ్ పడిపోవడంతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి
ఫోర్డ్ కార్ల ఉత్పత్తి కంపెనీ నిర్ణయంతో అమెరికా, కెనడాలోని పలు సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ ఉద్యోగులను ప్రభావితం చేయనుంది.
ఈ నేపథ్యంలో దాదాపుగా 3 వేల మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు సమాచారం. వీరిలో రెండు వేల మంది సాధారణ సిబ్బంది ఉండగా, మిగతా 1000 మంది కాంట్రాక్టు ఉద్యోగులని తెలుస్తోంది.
తాజాగా లేఆఫ్స్ ప్రకటనతో అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు నష్టం జరగనుంది. ఎక్కువగా ఉన్నత స్థాయి ఉద్యోగులపైనే దీని ప్రభావం పడనుందని అధికార వర్గాలు అంటున్నాయి.
అయితే లేఆఫ్ లకు సంబంధించిన సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా సంస్థ తెలియజేస్తోంది.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఫోర్డ్ వాహనాలకు డిమాండ్ పడిపోవడంతో నిర్వహణ ఖర్చులు భారమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల్ని తొలగించేందుకే కంపెనీ మొగ్గుచూపుతోంది.