NIKE Layoffs: వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్న 'నైక్'
2023లో ఉద్యోగుల తొలగించని రంగం అంటూ ఏదీ లేదు. కంపెనీ టెక్నాలజీ, రిటైల్ లేదా ఫ్యాషన్ ఇలా అన్ని రంగాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో కంపెనీ చెరబోతోంది. ప్రధాన దుస్తులు బ్రాండ్ నైక్ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేలోపు వందలాది ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. నైక్ కంపెనీ వందలాది ఉద్యోగాలను తగ్గించడం ద్వారా 2 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోవాలని చేస్తోంది. గత ఏడాది కాలంగా అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో వివిధ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవాలని కంపెనీ నిర్ణయించింది.
భారీగా తగ్గిన నైక్ అమ్మకాలు
2023లో Nike ఇప్పటివరకు పెద్దగా అమ్మకాల వృద్ధిని నమోదు చేయలేదు. గత మూడు నెలల్లో కంపెనీ విక్రయాల్లో కేవలం 1 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది కంపెనీ లాభాల మార్జిన్ పెరిగినా.. విక్రయాలు తగ్గుముఖం పట్టడం వల్ల దాని రిటైల్ రంగంపై అనిశ్చితి నెలకొంది. ఇటీవలి కాలంలో నైక్‌లో అమ్మకాలు నిలిచిపోవడమే కాకుండా.. కంపెనీ షేరు ధర 10 శాతం పడిపోయింది. జేడీ స్పోర్ట్స్, స్పోర్ట్స్ డైరెక్ట్ వంటి ఇతర సంస్థలు కూడా షేర్ మార్కెట్ క్షీణతను ఎదుర్కొంటున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించిన నైక్ కంపెనీ.. 2020లో 700 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి అతిపెద్ద లేఆఫ్‌కు రంగం సిద్ధం చేసింది.