Page Loader
Amazon layoffs: మరోసారి ఉద్యోగులను తొలగించడానికి సిద్దమైన అమెజాన్..
మరోసారి ఉద్యోగులను తొలగించడానికి సిద్దమైన అమెజాన్..

Amazon layoffs: మరోసారి ఉద్యోగులను తొలగించడానికి సిద్దమైన అమెజాన్..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ (Amazon) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. తాజా రౌండ్‌ లో కమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తప్పించనుంది. కార్యాచరణను సమర్థవంతంగా మార్చడంతో పాటు వ్యయాలను తగ్గించడానికి అమెజాన్‌ ఈ చర్యలు తీసుకుంటోంది. కంపెనీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టిన వ్యూహాత్మక చర్యల్లో భాగంగా ఈ ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయని తెలిపింది. అమెజాన్‌ కార్యకలాపాల సమర్థతను పెంచేందుకు ఉద్యోగుల తొలగింపు సహాయపడుతుందని కంపెనీ అభిప్రాయపడింది. లేఆఫ్‌లకు సంబంధించి అమెజాన్‌ ప్రతినిధి బ్రాడ్‌ గ్లాసర్‌ స్పందిస్తూ, ఉద్యోగుల తొలగింపు నిజమేనని తెలిపారు.

వివరాలు 

2022లో 27,000 మంది ఉద్యోగుల తొలగింపు 

అయితే, ఈ నిర్ణయం ఎంత కఠినమైనదో అర్థం చేసుకోవాలని చెప్పారు. కస్టమర్లను మరింత సమీపించేందుకు, సంస్థ స్థిరత్వాన్ని పెంచేందుకు ఈ చర్య అవసరమైందని పేర్కొన్నారు. ఉద్యోగాల కోల్పోయిన వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అమెజాన్‌ సీఈఓ ఆండీ జస్సీ (Andy Jassy) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా వరుసగా ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తూనే ఉంది. సంస్థ వ్యయ తగ్గింపు చర్యల్లో భాగంగా 2022లో 27,000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజా చర్యల్లో కమ్యూనికేషన్‌ విభాగంలోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అయితే, ఎంతమంది ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందో కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.