GTA maker Take-Two Interactive announces: ఉద్యోగాల కోత...పలు ప్రాజెక్టుల రద్దు...గ్రాండ్ థెప్ట్ ఆటో (జీటీఏ) మేకర్స్ సంచలన ప్రకటన
గ్రాండ్ థెఫ్ట్ ఆటో(జీటీఏ)(GTA)గేమ్ సిరీస్ మేకర్స్ రెండు సంచలన ప్రకటనలు చేశారు. తమ సంస్థలో ఐదు శాతం ఉద్యోగాల కోత (Job cuts) విధించేందుకు నిర్ణయించారు. దీంతోపాటు పలు ప్రాజెక్టులను రద్దు(Projects Termination)చేయాలనుకుంటున్నారు. జీటీఏ మేకర్స్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ సంస్థలో సుమారు 600 మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ఇండస్ట్రీ స్లంప్ లో నడుస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్ వివరించారు. ఆ సంస్థలో 11, 580 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులున్నారు. అనవసరపు వ్యయాల నియంత్రణ (కాస్ట్ కటింగ్)లో భాగంగా ఉద్యోగాల కోత తోపాటుగా ప్రస్తుతం నడుస్తున్న పలు గేమింగ్ ప్రాజెక్టులనుంచి విరమించుకోవడం లేదా రద్దు చేసుకోవాలని సంస్థ నిర్ణయించింది.
ఏడాదికి 165 మిలియన్ డాలర్లు ఆదా...
అయితే రద్దు చేయాలనుకుంటున్న ప్రాజెక్టు పేర్లను ఇంకా బయటకు వెల్లడించలేదు. దీని ఫలితంగా 200 మిలియన్ డాలర్ లు చార్జీల రూపంలో వస్తాయని అంచనా వేస్తున్నారు. ఏడాదికి ఏకంగా 165 మిలియన్ డాలర్లు సంస్థకు ఆదా అవుతాయి. ఉద్యోగాల కోత, ప్రాజెక్టుల తొలగింపు నిర్ణయం తీసుకోనప్పటికీ అమెరికా మార్కెట్ లోజరిగిన ట్రేడింగ్ లో 1శాతం పెరుగుదల కనిపించింది. సంస్థకు సంబంధించిన స్టాక్ మాత్రం ఏడాది మొత్తంలో 10 శాతం తగ్గుదల కనిపించింది. దీంతో ఉద్యోగాల కోత, పలు ప్రాజెక్టుల విరమణకు సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.