LOADING...
HP Layoffs: టెక్ రంగంలో మళ్లీ ఉద్యోగ కోతలు.. హెచ్‌పీలో6వేల మందికి లేఆఫ్‌లు..! 
హెచ్‌పీలో6వేల మందికి లేఆఫ్‌లు..!

HP Layoffs: టెక్ రంగంలో మళ్లీ ఉద్యోగ కోతలు.. హెచ్‌పీలో6వేల మందికి లేఆఫ్‌లు..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ రంగంలోని ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా పరిస్థితులు పెద్దగా మారలేదు. ప్రముఖ టెక్ కంపెనీలు వరుసగా ఉద్యోగ కోతలు ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఆర్థిక మందగమనం భయాలతో భారీ ఎత్తున సిబ్బందిని తగ్గించిన సంస్థలు... ఇప్పుడు కృత్రిమ మేధా (AI) ఆధారిత పనుల విస్తరణ కోసం మరోసారి లేఆఫ్‌లకు పాల్పడుతున్నాయి. తాజాగా పీసీలు, ప్రింటర్లు తయారీలో అగ్రగామైన హెచ్‌పీ (HP) కూడా ఈ కోతల జాబితాలో చేరింది. రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో మొత్తం 6 వేల మందికి పైగా సిబ్బందిని తొలగించే యోచనలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.

వివరాలు 

కుదేలైన హెచ్‌పీ షేర్లు

కంపెనీ కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించడం, అలాగే ప్రొడక్ట్ అభివృద్ధిలో కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచడమే ఈ ఉద్యోగ కోతల ప్రధాన కారణమని హెచ్‌పీ స్పష్టం చేసింది. 2028 ఆర్థిక సంవత్సరానికి ముందు ప్రపంచవ్యాప్తంగా తమ వర్క్‌ఫోర్స్‌ను 4,000 నుంచి 6,000 మధ్య తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలిపింది. ఈ కోతలు సంస్థ మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 10% కి సమానమని సంస్థ పేర్కొంది. ఈ నిర్ణయం వెలుగులోకి వచ్చిన వెంటనే హెచ్‌పీ షేర్లు గణనీయంగా పడిపోయాయి.