Amazon layoffs:అమెజాన్ లో మళ్ళీ ఉద్యోగుల తొలగింపు.. వందలమందిపై వేటు..!
అమెజాన్ మళ్లీ ఉద్యోగులను తొలగిస్తోంది. గత సంవత్సరం వేలాది మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత, ఈ-కామర్స్ దిగ్గజం దాని స్ట్రీమింగ్ , స్టూడియో కార్యకలాపాల నుండి అంటే దాని ప్రైమ్ వీడియో, MGM స్టూడియోస్ విభాగం నుండి 'కొన్ని వందల' ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. బుధవారం అమెజాన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో, ప్రైమ్ వీడియో, అమెజాన్ MGM స్టూడియోస్ తొలగింపు సమాచారాన్ని SVP అయిన మైక్ హాప్కిన్స్, ఉద్యోగులకు ఈ-మెయిల్స్ ద్వారా అందించనున్నట్లు వెల్లడించింది. తాజా తొలగింపులు అంతర్జాతీయంగా ఉంటాయని వెల్లడించినట్లుగా బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.
గత సంవత్సరం 27,000 కంటే ఎక్కువ ఉద్యోగాల తగ్గింపు
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. అమెజాన్ అనుబంధ సంస్థ, లైవ్-స్ట్రీమింగ్ కంపెనీ ట్విచ్, దాదాపు 500 మంది ఉద్యోగులలో దాదాపు 35 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ సిద్ధమైంది. తొలగింపు సమాచారాన్ని తర్వలో సదరు ఉద్యోగులకు అందించనున్నారు. ఇక, Amazonలో మొత్తం తొలగింపుల విషయానికొస్తే, టెక్ దిగ్గజం సిలికాన్ వ్యాలీ,గ్లోబల్ ఆఫీస్‌లలో వ్యాపించిన తొలగింపుల వేవ్‌లో భాగంగా గత సంవత్సరం 27,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను తగ్గించింది. ఈ నిర్ణయం ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ ద్వారా ప్రకటించిన భారీ తొలగింపులకు సమాంతరంగా ఉంది. గత సంవత్సరం ఒక్కొక్కరు 10,000 మంది కార్మికులను తొలగించారు. Google 12,000 మందిని తగ్గించింది.