Page Loader
Google layoffs: 1000 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ 
Google layoffs: 1000 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్

Google layoffs: 1000 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ 

వ్రాసిన వారు Stalin
Jan 16, 2024
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరికొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ హార్డ్‌వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్, అసిస్టెంట్‌తో సహా వివిధ విభాగాలలో పని చేస్తున్న 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. అయితే అర్హతను బట్టి కంపెనీలో మళ్లీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం ఇస్తామని ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో కంపెనీలో ఏప్రిల్ వరకు కొత్త స్థానాన్ని పొందలేని వారు.. ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్లాలని చెప్పింది.

గూగుల్

గతేడాది 12వేల ఉద్యోగుల తొలగింపు

హార్డ్‌వేర్, కోర్ ఇంజనీరింగ్, గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లలో అనేక వందల ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు వారం ముందే గూగుల్ వెల్లడించింది. గత 19ఏళ్లుగా గూగుల్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కెవిన్ బౌర్రిలియన్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఈ సందర్భంగా బౌర్రిలియన్ మాట్లాడుతూ.. తాను స్థాపించిన బృందంలోని 16మందితో సహా, తానూ ఉద్యోగాన్ని కోల్పోయానని వెల్లడించారు. అయితే ఉద్యోగం కోల్పోయినందుకు తాను బాధపడటం లేదన్నారు. గూగుల్ ఉద్యోగులను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. గత జనవరిలో కంపెనీ 12,000 ఉద్యోగాలను తగ్గించింది.