
Silent Layoffs: ఐటి ఉద్యోగం అంటే సడలుతోన్న ధీమా? వేలాది ఉద్వాసనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఐటి ఉద్యోగం అంటే లక్షల్లో జీతం ,మంచి కారు, విలాసవంతమైన జీవితమని అందరూ ఊహిస్తారు.
కానీ పని చేసే చోట వారు బిక్కు బిక్కు మని గడుపుతున్నారని మీకు తెలుసా ?ఎప్పుడు మేనేజర్ , హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ నుండి తనకు ఇమెయిల్ వస్తుందో తెలియదు.
వర్చువల్ మీటింగ్‌లో చేరమని వచ్చిందా ఇక గోవిందా గోవిందా అనాల్సిందే. అంటే ఉద్యోగం పోయినట్లే లెక్క.
ఇలా ఒక్కరు కాదు వందలు ,వేల మంది ఐటి ఉద్యోగులు ఎవరికీ చెప్పుకోలేని నరక యాతన అనుభవిస్తున్నారు.
తక్కువ చెల్లింపు జీతంతో పని చేయాలి లేదంటే ఉద్వాసన ఖాయం.లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసి నాలుగు నెలల జీతం ఇంటికి తీసుకెళ్లవచ్చు.
Details
నిశ్శబ్ద తొలగింపులతో కలకలం
కాగ్నిజెంట్‌లోని బెంచ్‌పై ఓ టెక్కీ25 రోజులు గడిపారు. ఆ తర్వాత అతనిని కొనసాగించడానికి కంపెనీ ఇతర ప్రాజెక్ట్‌లను వెతకటానికి ప్రయత్నించింది.
కానీ వేరే ప్రాజెక్ట్ దొరకలేదు. దీనితో టెక్కీని కొనసాగించరాదని ఆ సంస్ధ నిర్ణయించింది.
ఆయనను రాజీనామా చేయాలని కోరింది . టెక్కీ జీతంలో మూడు నెలల వేతనం చెల్లించి, ఇంటికి సాగనంపారు.ఇలాంటి అనుభవాలు ప్రస్తుతం ఐటి రంగంలో సర్వ సాధారణమయ్యాయి.
ఆల్ ఇండియా IT & ITeS ఎంప్లాయీస్ యూనియన్ (AIITEU) డేటా పంచుకుంది.
2023 సంవత్సరంలో భారతదేశంలో IT/ITeS రంగంలో దాదాపు 20,000 మంది టెక్కీలు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని AIITEU విశ్వసిస్తోంది. ఈ తొలగింపులు అన్ని IT సేవల కంపెనీలలో జరిగాయి.
Details
తొలగింపుకు ముందు కంపెనీలు ఏమి చేస్తారంటే ?
అదే కంపెనీలోను వేరే బాధ్యతలు ఉద్యోగికి 30 రోజుల సమయం ఇస్తారు. ఉద్యోగి చేయలేక పోతే వదిలి వెళ్ళమని అడుగుతారు.
చాలా సంస్థలలో ఉద్యోగుల నిశ్శబ్ద తొలగింపులు సర్వసాధారణమయ్యాయి. ఇందులో వారు తప్పక రాజీనామా చేసే పరిస్ధితులు కల్పిస్తారు.
2024లోనే భారతదేశంలోని అగ్రశ్రేణి ఐటీ సేవల కంపెనీలలో ఉద్వాసనల పర్వం కొనసాగింది. దాదాపు 2,000-3,000 మంది నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
IT ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) లెక్కలప్రకారం.
Details
రిలీవ్ అన్నారంటే వేరే ఉద్యోగం దొరకడం చాలా కష్టం
"కంపెనీలు ఉద్యోగులను తొలగించే అనేక మార్గాలు ఉన్నాయి ప్రతిఘటించే వారిని (వెంటనే) తొలగిస్తారు.
మీ రిలీవింగ్ లెటర్ లో తొలగించారని ముద్ర పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ పడితే మీ పని అయిపోయినట్లుగా భావించాలి.
ఆ వ్యక్తికి వేరే ఉద్యోగం దొరకడం చాలా కష్టమవుతుందన్నారు NITES ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఉద్యోగులు తమ పూర్తి చెల్లింపును పొందేందుకు కొన్ని సందర్భాల్లో సంతకం చేయాల్సి వుంటుంది.
Details
ప్రస్తుతం ఉద్యోగులు ప్రతిరోజు 14-16 గంటలు పని
నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్స్ (ఎన్‌డిఎ)పై సంతకం చేస్తారు అని AIITEU జనరల్ సెక్రటరీ సౌభిక్ భట్టాచార్య తెలిపారు.
రెండు సంవత్సరాల క్రితం 10-12 గంటలు పని చేశారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ప్రతిరోజు 14-16 గంటలు పని చేస్తున్నారని భట్టాచార్య వివరించారు.
"దాదాపుగా అన్ని కంపెనీలలో ఇదే పద్ధతి పాటిస్తున్నాయి.. లాభాలను పెంచుకునే క్రమంలో ప్రతి ఉద్యోగి పని గంటల సంఖ్యను పెంచుతున్నాయని, "అని భట్టాచార్య తెలిపారు.