LOADING...
IBM: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల కోతలు చేపట్టనున్న IBM
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల కోతలు చేపట్టనున్న IBM

IBM: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల కోతలు చేపట్టనున్న IBM

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

AI టెక్నాలజీ వైపు సంస్థ దృష్టి మళ్లుతున్న నేపథ్యంలో IBM మరోసారి ఉద్యోగుల కోతలు చేపట్టబోతోందని సమాచారం. 2025 నాలుగో త్రైమాసికంలో కంపెనీ గ్లోబల్ స్థాయిలో స్వల్ప శాతంలో ఉద్యోగులను తగ్గించనున్నట్టు సంస్థ ప్రతినిధి తెలిపాడు. ఇందులో అమెరికాలోని కొన్ని పోస్టులు కూడా ప్రభావితం అవొచ్చని చెప్పినా, US ఉద్యోగుల మొత్తం సంఖ్య మాత్రం ఎప్పటిలానే కొనసాగుతుందని స్పష్టంచేశారు. ప్రస్తుతం IBMలో సుమారు 2.70 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యలో 'లో సింగిల్ డిజిట్' శాతం ఉద్యోగులను తగ్గిస్తే, వేలల్లో ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఉదాహరణకు, కేవలం 1% పోస్టులను తగ్గించినా దాదాపు 2,700 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది.

వివరాలు 

14,000 మందిని తొలగించిన అమెజాన్ 

టెక్ దిగ్గజాల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్న తరుణంలో IBM నిర్ణయం కూడా అదే ధోరణి లో భాగంగా కనిపిస్తోంది. ఇప్పటికే Amazon, Google,Meta లాంటి కంపెనీలు కూడా AI ఆధారిత పునర్వ్యవస్థీకరణ కారణంగా పెద్దఎత్తున ఉద్యోగులను తగ్గించాయి. తాజాగా Amazon ప్రపంచవ్యాప్తంగా 14,000 మందిని తొలగించగా, వ్యయాలను తగ్గించడం, సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా Salesforce కూడా 4,000కుపైగా ఉద్యోగులను తగ్గించింది. ఇదే తరహాలో Google కూడా ఈ ఏడాది వందలాది ఉద్యోగాలను కోతలోకి తీసుకుంది. మరోవైపు, Microsoft జూలై నెలలో దాదాపు 9,000 మందిని (దాదాపు 4% ఉద్యోగులను) తొలగించాలని ప్రకటించింది. AI వ్యవస్థలు కంపెనీ కార్యకలాపాల్లోకి వేగంగా ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగాల కోతలు ఇంకా కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.