LOADING...
Lucknow: లక్నోలో దారుణం.. తండ్రిని హతమార్చి.. ముక్కలుగా చేసి డ్రమ్ములో దాచి!
లక్నోలో దారుణం.. తండ్రిని హతమార్చి.. ముక్కలుగా చేసి డ్రమ్ములో దాచి!

Lucknow: లక్నోలో దారుణం.. తండ్రిని హతమార్చి.. ముక్కలుగా చేసి డ్రమ్ములో దాచి!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తన తండ్రిని తుపాకీతో కాల్చి హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి డ్రమ్ములో దాచిపెట్టిన సంఘటన కలకలం రేపింది. 'నీట్' పరీక్షకు సిద్ధం కావాలంటూ తండ్రి తరచూ చేస్తున్న ఒత్తిడిని భరించలేకే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. లఖ్‌నవూకు చెందిన మానవేంద్ర ప్రతాప్ సింగ్ ఈ నెల 20వ తేదీ నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి పరిశీలనలో భాగంగా ఒక డ్రమ్ములో మానవ శరీర భాగాలు లభించాయి. అనుమానాస్పద పరిస్థితుల్లో కుమారుడిని విచారించగా, అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు.

వివరాలు 

రైఫిల్‌తో తండ్రిపై కాల్పులు

నీట్ పరీక్ష కోసం చదవాలని తండ్రి నిరంతరం ఒత్తిడి చేయడం, మందలించడం వల్ల ఇంట్లో తరచూ వాగ్వాదాలు జరిగేవని విచారణలో తెలిపాడు. నిందితుడి తల్లి 2018లో మరణించగా, ప్రస్తుతం అతడు తన తండ్రి, సోదరితో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 20న పరీక్షా సిద్ధత విషయంపై తండ్రీకుమారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని, ఆగ్రహావేశంలో కుమారుడు రైఫిల్‌తో తండ్రిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని మూడో అంతస్తు నుంచి కింద అంతస్తులోని ఖాళీ గదికి తరలించి, ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. శరీరాన్ని ముక్కలుగా చేసి, కొన్ని భాగాలను సదరోనా గ్రామం సమీపంలో పారవేశాడని, మిగతా భాగాలను ఇంట్లో ఉన్న డ్రమ్ములో దాచిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement