
Google layoffs: ఆ కేటగిరీలో 10% ఉద్యోగాల కోతను ప్రకటించిన సుందర్ పిచాయ్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శుక్రవారం డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లతో సహా మేనేజిరియల్ స్థాయిలో 10% ఉద్యోగాలను తగ్గించే నిర్ణయాన్ని ప్రకటించారు.
కృత్రిమ మేధ (ఏఐ) విభాగంలో సంస్థలు పెరుగుతున్న పోటితో, గూగుల్ సహా అనేక కంపెనీలు లే ఆఫ్స్ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి.
ఓపెన్ ఏఐ వంటి సంస్థల నుంచి వస్తున్న పోటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గూగుల్ గత కొంత కాలంగా సంస్థాగత మార్పులను చేస్తోందని, భాగంగా మానవ వనరులను తగ్గించి, కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా, సరళంగా మార్చడంపై దృష్టి పెట్టింది.
ఈ మార్పులలో భాగంగా, సుందర్ పిచాయ్ ప్రకారం, 10% ఉద్యోగ కోత మేనేజర్లు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లలో విధించబడింది.
వివరాలు
గత కొన్నేళ్లుగా ఎఫిషియెన్సీ డ్రైవ్ లో..
ఈ కోత కారణంగా కొందరిని కొత్త బాధ్యతలతో నియమించగా, మరికొందరిని పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
గూగుల్ ఎఫిషియెన్సీ డ్రైవ్ లో చాలా కాలంగా ఉంది. 2022 సెప్టెంబర్ లో గూగుల్ 20% మరింత సమర్థవంతంగా పని చేయాలని పిచాయ్ అభిప్రాయపడ్డారు.
2023 జనవరిలో, గూగుల్ సంస్థ 12,000 ఉద్యోగులను తొలగించింది, ఇది సంస్థ చరిత్రలోనే అత్యధిక లే ఆఫ్స్ లో ఒకటి. గూగుల్ సెర్చ్ వ్యాపారానికి ఏఐ పోటీ తీవ్రత పెరగడంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం అవసరం అయింది.
వివరాలు
గూగుల్ కొత్త ఫీచర్లతో ముందుకు..
ఇంకా, గూగుల్ తన ప్రధాన వ్యాపారాలలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను సముచితంగా చొప్పించి, ఇతర ఏఐ సంస్థలను ఎదుర్కొంటోంది.
ఓపెన్ఏఐ వంటి పోటీదారులను అధిగమించడానికి గూగుల్ కొత్త ఫీచర్లతో ముందుకు వస్తోంది.
ఈ మార్పులలో భాగంగా, గూగుల్ కొత్త ఏఐ వీడియో జనరేటర్, "రీజనింగ్" మోడల్‌తో పాటు కొత్త జెమినీ మోడళ్లను ప్రవేశపెట్టింది.
బుధవారం జరిగిన ఒక స్టాఫ్ మీటింగ్ లో గూగుల్ లోపలి సంస్కృతిని, "గూగ్లీనెస్" అనే భావనను కూడా పిచాయ్ వెల్లడించారు.