
Intel Layoffs: ఇంటెల్ తన ఉద్యోగులలో 20% కంటే ఎక్కువ మందిని తొలగించనుంది: నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు త్వరలో తొలగే సూచనలు కనిపించడంలేదు.
ప్రఖ్యాత టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను గణనీయంగా తగ్గించుకుంటున్న వేళ, తాజా నివేదికల ప్రకారం టెక్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు సన్నద్ధమవుతోంది.
బ్లూమ్‌బర్గ్ తాజా సమాచారం ప్రకారం, సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో 20 శాతం మందికిపైగా ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయాన్ని ఇంటెల్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కోనసాగింపు చర్యల ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశం ఉంది.
వివరాలు
నూతన సీఈఓ నేతృత్వంలో భారీ లేఆఫ్స్
ఇటీవల మార్చిలో ఇంటెల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన లిప్-బు తాన్ నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకోబడుతోంది.
సంస్థకు సంబంధించిన సమాచారం ప్రకారం, ఈ వారం 20,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ఇంటెల్ ప్రకటించనున్నట్లు అంచనా.
2024లో కంపెనీ 19 బిలియన్ డాలర్ల మేర నష్టాలను చవిచూసిన నేపథ్యంలో ఈ చర్యల ద్వారా ఖర్చులను తగ్గించుకోవడం, మేనేజ్‌మెంట్ వ్యయాలను కుదించడం, సంస్థలో మళ్లీ ఇంజినీరింగ్ ఆధారిత శైలి నెలకొల్పడమే లక్ష్యంగా ఉంది.
వివరాలు
ఇంతకుముందూ తొలగింపులు చేసిన ఇంటెల్
ఇది ఇంటెల్ తొలిసారి ఉద్యోగులను తొలగించాలనుకుంటున్న సందర్భం కాదు. కంపెనీ ఆర్థికంగా కుదేలవుతున్న పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గతంలోనూ ఉద్యోగాల తగ్గింపునకు పాల్పడింది.
2024 ఆగస్టులో ఇంటెల్ సుమారు 15,000 మందిని తొలగించింది. ఆ సమయంలో సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,08,900కు చేరింది.
అంతకుముందు సంవత్సరం అంటే 2023లో ఈ సంఖ్య 1,24,800గా ఉంది. ఇదే విషయాన్ని బలంగా చూపిస్తోంది - సంస్థ ఉద్యోగాలపై వరుసగా కోతలు విధిస్తున్నదని.
వివరాలు
టెక్ రంగంలో ఉద్యోగాల తొలగింపుల స్థితిగతులు
టెక్ పరిశ్రమ మొత్తానికీ ఇది చీకటి కాలం అని చెప్పవచ్చు. లేఆఫ్స్.ఎఫ్‌వైఐ లెక్కల ప్రకారం, 2025లో ఇప్పటి వరకు 257 టెక్ కంపెనీలు కలిపి సగటున రోజుకు 450 మందిని తొలగించాయి.
మొత్తంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 50,372 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
గత సంవత్సరం 2024లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. అప్పట్లో 1,115 సంస్థలు కలిపి మొత్తం 2,38,461 మందిని తొలగించినట్లు నమోదైంది.
వివరాలు
ఇంటెల్‌కు తోడు గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా
ఇంటెల్ ఒకటే కాదు,ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగాలపై కోత విధిస్తున్నాయి.
2025 ఏప్రిల్‌లో గూగుల్ తన ప్లాట్‌ఫామ్స్,డివైజెస్ విభాగాల్లో.. అంటే ఆండ్రాయిడ్,పిక్సెల్,క్రోమ్ విభాగాల్లో.. వందలాది మంది ఉద్యోగులను తొలగించింది.
అంతకుముందు క్లౌడ్,మానవ వనరుల విభాగాల్లోనూ గూగుల్ కోత విధించింది.
ఇంకా,మైక్రోసాఫ్ట్ కూడా మేలో ఉద్యోగుల తొలగింపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇంజినీర్-టు-మేనేజర్ నిష్పత్తిని పెంచే దిశగా, మిడిల్ మేనేజ్‌మెంట్‌లో పని చేస్తున్నవారిని, తక్కువ పనితీరు చూపినవారిని లక్ష్యంగా చేసుకుని తొలగింపులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా భద్రతా విభాగంలో ఈచర్యలు ఉండబోతున్నాయి.ఫేస్‌బుక్ మాతృ సంస్థ అయిన మెటా కూడా 2025 ఫిబ్రవరిలో 3,600 మంది ఉద్యోగులను తొలగించింది.
సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో పనితీరు ఆధారంగా తొలగింపులకు ప్రాధాన్యతనిచ్చింది.