Techies-Layoffs-Firms: దారుణంగా టేకీల పరిస్థితి...నెలలోనే 21 వేల మంది తొలగింపు
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ (Technology) కంపెనీ (Firms)లు ఉద్యోగులు తొలగిస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టులు లేకపోవడం ఆర్థిక అస్థిరత వంటి కారణాలతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు లే ఆఫ్ (Lay off) లు ప్రకటిస్తున్నాయి. టెక్ కంపెనీలో లే ఆఫ్ లకు సంబంధించి సంచల నివేదిక ఒకటి బయటకు వెల్లడయింది. ఒక్క ఏప్రిల్ (April) నెలలోనే 21,000 మందికి పైగా ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. ఆ నివేదిక ప్రకారం 50 కంపెనీల నుంచి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 78 వేలకు పైగా ఉద్యోగులు తొలగింపు
ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు 271 కంపెనీలు 78,572 మందిఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్ లు ప్రకటించిన కంపెనీలో ఆపిల్, అమెజాన్, ఎడ్డెక్ కంపెనీ, బైజుస్, టెస్లా, ఓలా క్యాబ్స్, హెల్తీ ఫైమ్,వర్ల్పూల్, టేక్ టు ఇంట్రాక్టివ్ వంటి సంస్థలున్నాయి.