LinkedIn Layoff : లింక్డ్ఇన్‌లో 668మందికి లే ఆఫ్
మైక్రోసాఫ్ట్ (Microsoft) యాజమన్యంలోని లింక్డ్‌ఇన్(LinkedIn) మరోసారి లే ఆఫ్ ప్రకటించింది. లింక్డ్ఇన్ సంస్థ ఇంజనీరింగ్, ప్రొడెక్ట్, ప్రతిభ, ఫైనాల్స్ విభాగాల్లో లేఆఫ్‌లు ప్రకటించింది. దాదాపు 20వేల సిబ్బందితో కలిగిన లింక్డ్‌ఇన్ తాజాగా సంస్థ మొత్తం సిబ్బందిలో 3శాతం మందిని తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో 668 మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సోమవారం స్పష్టం చేసింది. తమ బృందంతో కలిసి చేసిన మార్పుల వల్ల 668 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. లింక్డ్ఇన్ జాబ్ యాడ్ లిస్టింగ్‌లు, ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ల ద్వారా ఆదాయాన్ని పొందుతోంది. దీనికి దాదాపు 950 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు.
మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన లింక్డ్ఇన్
అయితే కొత్త సభ్యులకు సైన్ అప్ చేయడం కొనసాగిస్తున్నప్పటికీ ప్రకటన వ్యయం తగ్గడం, మరోవైపు కంపెనీ ఆర్థికంగా దెబ్బతింది. ఈ ఏడాది మేలో కూడా తొలి విడత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కంపెనీ చేపట్టింది. విక్రయాలు, కార్యకలాపాలు, సహయక బృందాలలో 716 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరో 668 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి లింక్డ్ఇన్ సిద్ధమైంది. ఇక 2022 సంవత్సరం చివరి నుంచి అమెజాన్, మెటా, గూగుల్, అల్పాబెట్‌తో సహా పలు కంపెనీలు సాంకేతిక రంగంలో పదివేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.