ZestMoney కంపెనీ మూసివేత.. 150 మంది ఉద్యోగుల తొలగింపు
బీఎన్‌పీఎల్ స్టార్టప్ 'జెస్ట్‌మనీ(ZestMoney)'ని మూసివేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. కంపెనీ మూసివేత విషయాన్ని డిసెంబర్ 5న ఉద్యోగులకు యాజమాన్యం తెలియజేసింది. కంపెనీ మూసివేయడం వల్ల 150 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించనుంది. కంపెనీ ఉద్యోగులకు రెండు నెలల జీతంతో ఇతర బెన్ ఫిట్స్ అందజేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ZestMoney వ్యవస్థాపకులు కంపెనీ నుంచి వైదొలిగిన కొన్ని నెలల తర్వాత మూసివేస్తున్నట్లు ప్రకటన రావడం గమనార్హం. కొత్త మేనేజ్‌మెంట్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. తొలుత జెస్ట్‌మనీని ఫోన్ పే కొనుగోలు చేయాలని అనుకుంది. కొనుగోలు ప్రతిపాదనను ఫేన్ పే విరమించుకోవడంతో జెస్ట్‌మనీ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.